Multibagger Stock: లక్ష రూపాయల పెట్టుబడి రూ. 2 లక్షల 50 వేలు అయింది.. ఎలాగంటే..
Multibagger stock: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ 2021లో అద్భుతమైన రాబడిని ఇచ్చింది...
Multibagger stock: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ 2021లో అద్భుతమైన రాబడిని ఇచ్చింది. కోవిడ్ తర్వాత మార్కెట్ పుంజుకోవడంతో 2021లో మంచి సంఖ్యలో భారతీయ స్టాక్‌లు మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలోకి ప్రవేశించాయి. సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్ప్ (SPIC) షేర్లు భారతదేశంలోని మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కో షేరు రూ. 24.40 నుంచి రూ.51.60కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 110 శాతం పెరిగింది.
ఛాయిస్ బ్రోకింగ్‌కు చెందిన సుమీత్ బగాడియా ఈ స్టాక్‌లో ఇంకా కొంత పెరిగే అవకాశం ఉందని.. 3 నెలల టార్గెట్ రూ.68 వరకు స్టాక్‌పై కొనుగోలు కాల్ ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ” నెలవారీ చార్ట్‌లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.35.40 స్థాయికి దిగువ స్థాయికి చేరుకుందని గరిష్ఠంగా రూ.68.45చేరుకుందని చెప్పారు. ఇది అధిక స్థాయి నుంచి ప్రాఫిట్ బుకింగ్‌ను చూపించిందన్నారు. రూ.43.10 స్థాయి వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 2020 డిసెంబర్ 21న రూ.21 ఉంది. ప్రస్తుతం రూ.53గా ఉంది. అంటే దాదాపు 132 శాతం పెరిగింది. ఈ స్టాక్‌లో సంవత్సరం క్రితం లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ప్రస్తుతం దాని విలువ రూ.2.5 లక్షలుగా ఉంది.
Note: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.