Harsh Goenka: ఐపీఎల్ ఫౌండర్, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ (Lalit Modi), మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (Sushmita Sen) ల డేటింగ్ వ్యవహారం అటు సినిమా, ఇటు క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘బెటర్ హాఫ్’ అంటూ లలిత్ మోడీ సుస్మితను సంభోదించడంతో చాలామంది వీరికి పెళ్లైపోయినట్లు భావించారు. అయితే ఆ తర్వాత జస్ట్ డేటింగ్‌లో మాత్రమే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు మోడీ. ఇక ఈ వ్యవహారంపై సుస్మిత కూడా స్పందించింది. అయితే అందులో లలిత్ మోడీ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇదిలా ఉంటే వీరి డేటింగ్ వ్యవహారంపై ఒక్కొక్కరు ఒకోలా స్పందిస్తున్నారు. ఇప్పటికే రాఖీసావంత్, తస్లీమా నస్రీన్ లాంటి ప్రముఖులు వీరి రిలేషన్‌షిప్‌పై కామెంట్లు చేశారు. ఇక సమకాలీన అంశాలు, సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ వ్యాపార వేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంక (Harsh Goenka) కూడా మోడీ- సుస్మిత రిలేషన్‌షిప్‌పై రియాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీల ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన ‘ ఒక మోడీ (ప్రధాని)కి ఇండియా కావాలి. మరో మోడీ (లలిత్)కి మిస్ ఇండియా కావాలి. ఇంకో మోడీ (నీరవ్) ఇండియాకే కావాలి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పీఎన్‌బీ కుంభకోణం కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.
One Modi wants India
One Modi wants Miss India
One Modi is wanted in India pic.twitter.com/kKZLjp3LsA— Harsh Goenka (@hvgoenka) July 16, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..