Business Ideas: మహిళలూ.. వంటగదిలో రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు.. నెలకు రూ. లక్ష వరకు గ్యారంటీ.!
మీకు ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోవట్లేదా.? భారీ లాభాలను ఆర్జించే వ్యాపారాన్ని ఏదైనా ప్రారంభించాలని చూస్తున్నారా.! అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. ఈ వ్యాపారానికి ఎలాంటి రిస్క్ ఉండదు. అతి తక్కువ పెట్టుబడితో..
మీకు ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోవట్లేదా.? భారీ లాభాలను ఆర్జించే వ్యాపారాన్ని ఏదైనా ప్రారంభించాలని చూస్తున్నారా.! అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. ఈ వ్యాపారానికి ఎలాంటి రిస్క్ ఉండదు. అతి తక్కువ పెట్టుబడితో దీన్ని ప్రారంభించి ప్రతి నెలా రూ. లక్ష వరకు సంపాదనను ఆర్జించవచ్చు. మరీ ముఖ్యంగా మహిళల కోసం ఈ బిజినెస్.. వారు ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ఇంటి ఫుడ్ కోసం చూస్తుంటారు. సిటీలలో ఉంటున్న ఉద్యోగస్తులు తమ ఉద్యోగ ఒత్తిడిలో, యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హడావుడిలో రోడ్‌సైడ్ ఫుడ్‌కే అలవాటు పడుతున్నారు. అలాగే పలు ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం మీరు టిఫిన్ సర్వీస్‌ను ఏర్పాటు చేయవచ్చు. వారికి మంచి ఇంటి ఫుడ్‌ను ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించవచ్చు.
తక్కువ పెట్టుబడితో..
ఈ వ్యాపారానికి ప్రత్యేకంగా స్థలం ఏది అక్కర్లేదు. బదులుగా మీరు దీన్ని మీ ఇంటి వంటగది నుంచే ప్రారంభించవచ్చు. దీనికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు వరకు ఉంటే చాలు. ఈ వ్యాపారానికి మౌత్ పబ్లిసిటీ ఉపయోగపడుతుంది. ఆ మౌత్ పబ్లిసిటీనే.. మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది.
ప్రతి నెలా అధిక సంపాదన..
ప్రజలు మీ ఆహారాన్ని ఇష్టపడితే, మీరు ఈ వ్యాపారంలో ప్రతి నెలా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఇంటి నుంచి ఈ వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారానికి సులభంగా మార్కెటింగ్ చేయవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో పేజీలను క్రియేట్ చేసి.. బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోండి.