మోదీ 3.0 తొలి సాధారణ బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం బడ్జెట్ తయారీలో బిజీగా ఉన్నారు. హల్వా వేడుక ముగిసింది. ఈ బడ్జెట్‌పై సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతి రంగానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. అయితే జులై 23న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు చేస్తారో ఎవ్వరికి తెలియదు. అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్‌కు సంబంధించి ఇప్పటికే సూచనలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Budget-2024: బడ్జెట్ ప్రతుల కోసం ఎరుపు రంగు బ్యాగునే ఎందుకు వాడుతారు?
రాష్ట్రపతి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈసారి బడ్జెట్ ధీర్ఘకాలిక విధానాలకు సంబంధించిన బడ్జెట్ ఉంటుందని, ప్రధానంగా సామాజిక, ఆర్థిక నిర్ణయాల ప్రకటన ఉంటుందని అన్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2014 నుంచి దేశం ఆర్థిక సంస్కరణల బాటలో ముందుకు సాగుతోందని, కొత్త ఎన్డీయే ప్రభుత్వంలోనూ ఈ దిశగానే కృషి కొనసాగుతుందని చెప్పారు.
ఈసారి సీతారామన్ మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండే బడ్జెట్ సమర్పిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఆర్థిక లోటు గురించి ఆందోళనతో పాటు సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు.
ఇది కూడా చదవండి:FASTag Rules: వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం.. ఫాస్టాగ్ ఉండి కూడా ఈ పొరపాటు చేస్తున్నారా? రెట్టింపు టోల్ వసూలు
ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్ టాటా ఇల్లు ఇంత సింపుల్‌గానా..? ఎలా ఉంటుందో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి