- Telugu News Business Budget 2024 Nirmala sitharaman allot more funds for farmers take loans become easier
Budget 2024: ఈ బడ్జెట్‌లో రైతుల కోసం రుణ పరిమితి పెంచనున్నారా?
ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55 లక్షల కోట్లు. ఇది ఈ కాలానికి నిర్దేశించిన రూ.18.50 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) నెట్‌వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాలు పొందారు. మార్చి 31, 2023 వరకు దాదాపు రూ.8.85 లక్షల కోట్లు..
Updated on: Jan 23, 2024 | 2:49 PM

రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించవచ్చు. అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణాలు అందేలా చూస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తోంది. అంటే రైతులు ఏటా ఏడు శాతం రాయితీపై రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు పొందుతున్నారు.

సకాలంలో చెల్లించే రైతులకు ఏడాదికి మూడు శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా అందజేస్తున్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు పెరగవచ్చు. వ్యవసాయ రుణాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది.

అలాగే అర్హులైన రైతులను గుర్తించి వారిని రుణ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక ప్రచారాలను నిర్వహిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కేంద్రీకృత విధానంలో భాగంగా 'క్రెడిట్' (రుణాల కోసం)పై ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించింది.

అంతేకాకుండా వివిధ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల కోసం రుణాల పంపిణీ గత 10 సంవత్సరాలలో లక్ష్యాన్ని మించిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 20 లక్షల కోట్లలో 82 శాతం డిసెంబర్ 2023 నాటికి సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, ఆ కాలంలో దాదాపు రూ.16.37 లక్షల కోట్ల విలువైన రుణాలు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55 లక్షల కోట్లు. ఇది ఈ కాలానికి నిర్దేశించిన రూ.18.50 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) నెట్‌వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాలు పొందారు. మార్చి 31, 2023 వరకు దాదాపు రూ.8.85 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి.




