కేవలం 1 లక్షకే మారుతి సుజుకీ కారు.. మరి మిగతా అమౌంట్‌ సంగతేంటి?

13 December 2024

Subhash

మారుతి సుజుకి కార్లు సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఉంటాయి. మంచి మైలేజీని కూడా ఇస్తాయి.

మారుతి సుజుకి కార్లు

ఇండియన్ మార్కెట్లో బాగా ఇష్టపడే ఈ కార్లలో విభిన్న మోడల్స్ ఉన్నాయి. ఈ కార్లలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్ఆర్. కంపెనీ ఈ కారు CNG వెర్షన్‌ను కూడా విక్రయిస్తుంది.

CNG వెర్షన్‌

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ దీని ఆన్-రోడ్ ధర ఢిల్లీలో రూ. 6 లక్షల 45 వేలు. నగరాలను బట్టి ఈ ధర మారవచ్చు.

వ్యాగన్ఆర్ సిఎన్‌జి

ఈ మారుతి సుజుకీ బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి.

మారుతి సుజుకీ బేస్ మోడల్‌

ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్ల పాటు బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రుణం తీసుకుంటే, మీకు రూ. 5.45 లక్షల వరకు రుణం లభిస్తుంది.

ఈ కారును కొనుగోలు

ఇప్పుడు మీరు బ్యాంక్ లేదా కంపెనీ తీసుకున్న ఈ లోన్‌ని EMI రూపంలో తిరిగి చెల్లించాలి. మీరు 5 సంవత్సరాల పాటు వడ్డీ రేటుతో సహా మొత్తం రూ.6.91 లక్షలు బ్యాంకుకు చెల్లించాలి. 

5 సంవత్సరాలు

ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ప్రతి నెలా రూ. 11,000 EMI చెల్లించాలి. రుణం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవడం ముఖ్యం.

EMI 

మీరు రూ.1 లక్షల చెల్లించి మిగతా మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించవచ్చు. పూర్తి మొత్తం చెల్లించలేనివారికి ఈ ఈఎంఐ ఆప్షన్‌ బెస్ట్‌.

ఈఎంఐలో