వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మందికి రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది. సోషల్ మీడియాలో ఎలాగైనా సెలబ్రిటీ అయిపోవాలని.. తమ వీడియోలు, ఫోటోలు వైరల్ అయి.. వీలైనన్ని లైక్స్, వ్యూస్ సంపాదించేందుకు ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరి ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి రీల్స్ చేస్తున్నారు.
అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం అలాంటి వీడియో కోసం ప్రయత్నించి ఓ యువతి రైలు నుంచి జారిపడింది. అయితే, స్నేహితులు సకాలంలో స్పందించి ఆమెను ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. గత వారం శ్రీలంకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చైనాకు చెందిన ఓ యువతి.. తన స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం ఇటీవల శ్రీలంక వెళ్లింది. అక్కడి పర్యాటక ప్రాంతంలో రైలు ఎక్కి… బోగి తలుపు వద్ద ప్రమాదకరంగా నిలబడి వీడియో తీసుకుంటోంది. ఈ క్రమంలో చెట్ల కొమ్మలు తగిలి ఆమె రైల్లోంచి పడిపోయింది. ఈ విషయం గమనించిన ఆమె స్నేహితులు.. తర్వాత వచ్చిన స్టేషన్‌లో దిగి ఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక
వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!

