డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం

Phani CH

|

Updated on: Dec 16, 2024 | 8:51 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరి కొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన తను అధ్యక్షుడిగా మారాక చేయనున్న పలు అంశాలను మందుగానే ప్రకటిస్తున్నారు. తాజాగా డే లైట్ సేవింగ్ టైమ్‌ ను రద్దు చేస్తానని ప్రకటించారు. ఈమేరకు ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘రిపబ్లికన్‌ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుంది.

ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. అయితే ఈ డే లైట్ సేవింగ్ టైమ్‌ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలిసిందే. అయితే యూఎస్ఏలోని కొన్ని ప్రాంతాలు వివిధ టైమ్ జోన్ లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పగటిపూట సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ‘డే లైట్ సేవింగ్ టైమ్’. దీని ప్రకారం.. మార్చిలో పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉన్నపుడు గడియారాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. తిరిగి నవంబర్ లో ఒక గంట వెనక్కి జరుపుతారు. దీని ఉద్దేశం పగటి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. ఏటా మార్చి రెండవ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని గంట ముందుకు తిప్పి 3 గంటలు చూపించేలా మార్చుతారు. తిరిగి నవంబర్ మొదటి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని 1 గంట చూపించేలా మార్చేస్తారు. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుందని, అందుకే దీనిని రద్దు చేయనున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు

వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??

భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక

వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!