33 గంటలు… నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం
అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామీజీ ఆధ్వర్యంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 33 గంటలు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిగింది. హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞంలో పాల్గొన్నారు.
వేలాదిమంది ఒకే వేదికపై చేపట్టిన ఈ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీ స్వామీజీ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భానికి వేదిక నిలిచిన అవధూత దత్తపీఠం నాదమంటపాన్ని భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్టాంప్ విడుదల చేసింది. నాద మంటపం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సనాతన ధర్మానికి స్వామీజీ చేస్తున్న సేవ గురించి ప్రశంసించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం
ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు
వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??
భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక
వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి