BSNL న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 227కే 60 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఏంటంటే!

|

Dec 29, 2024 | 3:13 PM

ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తన వినియోగదారులు మెరుగైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. ఇప్పటికే 4G సేవలు వేగంగా అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థ త్వరలోనే 5G సేవలను ప్రారంభించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను ప్రకటిస్తోంది.

BSNL న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 227కే 60 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఏంటంటే!
Follow us on

రాబోయే 2025 కొత్త ఏడాది సందర్భంగా దేశీయ ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్‌ ధరలు పెంచడంతో లక్షలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ధరలు పెంచకపోవడమే కాకుండా చౌకైన ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తాజాగా 60 రోజుల పాటు 120జీబీ డేటాను అందించే చౌకైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు జియో, ఎయర్‌టెల్‌, విలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ ఇస్తోంది. 2025 కొత్త ఏడాదికి బీఎస్ఎన్ఎల్ రూ.277 ధరతో పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారీ ఇంటర్నెట్ వాడే వినియోగదారులు, వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్‌ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: SIM Card New Rule: షాకింగ్‌ న్యూస్‌.. ఈ వ్యక్తులు 3 సంవత్సరాల పాటు సిమ్ కార్డ్ పొందలేరు.. !

అన్‌లిమిటెడ్ కాల్స్

ఇవి కూడా చదవండి

ఈ ప్లాన్‌లో 120జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. 2జీబీ రోజువారీ డేటాను అందుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో మొత్తం రెండు నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 60 రోజుల పాటు. ఈ ప్లాన్‌ జనవరి 16లోపు రీఛార్జ్‌ చేసుకునే వారికి అవకాశం ఉంటుంది. ‘మోర్ డేటా, మోర్ ఫన్’ అని పేరుతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ జనవరి 16, 2025 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

4జీ, 5జీ నెట్‌వర్క్‌ కోసం ప్రయత్నాలు :

ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే 60వేలకు పైగా 4జీ టవర్లు ఉండగా, త్వరలో 5జీ సేవలను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేవట్‌ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లక్షలాది మంది తమ సిమ్‌కార్డులను పోర్ట్‌ పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి