BSNL New Plans: బీఎస్‌ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. నెలకు 75 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. పూర్తి వివరాలివే..

BSNL New Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సరసమైన ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీతో..

BSNL New Plans: బీఎస్‌ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. నెలకు 75 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. పూర్తి వివరాలివే..
Bsnl
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2022 | 3:19 PM

BSNL New Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సరసమైన ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఇందులో డేటా కూడా భారీగానే ఇవ్వడం విశేషం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ లో భాగంగా బీఎస్ఎన్‌ఎల్ ఈ రూ. 2022 ఆఫర్‌ను ప్రకటించింది.

BSNL రూ. 2022 ప్లాన్ వివరాలు.. BSNL రూ. 2022 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 75 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 300 రోజులు ఉంటుంది. డేటాతో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తోంది. ఇక ప్రతి నెలా అందుబాటులో ఉన్న 75 GB డేటా కోటాను పూర్తిగా ఉపయోగించిన తర్వాత, దాని వేగం 40Kbpsకి తగ్గుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ప్లాన్‌తో, మొదటి 60 రోజులు మాత్రమే డేటా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డేటా అవసరమయితే.. ప్రత్యేకంగా డేటా వోచర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ భాగంగా బీఎన్ఎస్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ ఆగస్టు 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందాలనుకుంటే.. ఆగస్టు ముగిసే లోపు రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఆఫర్‌ను బిఎస్ఎన్‌ఎల్.. ఆగస్టు 2న ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..