BSNL నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్.. ఒక నెల ఫ్రీ ఇంటర్నెట్.. అతి చవక ధరకే కనెక్షన్

Bsnl Broadband Plans: బీఎస్ఎన్‌ఎల్ తమ కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే హై స్పీడ్ వైఫై ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌తో అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చు. అలాగే అతి తక్కవ ధరలో టీవీ ఛానెల్స్ వీక్షించే ప్లాన్ కూడా తెచ్చింది.

BSNL నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్.. ఒక నెల ఫ్రీ ఇంటర్నెట్.. అతి చవక ధరకే కనెక్షన్
Bsnl Internet Connection

Updated on: Dec 15, 2025 | 7:43 PM

కేంద్ర ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్ సేవలే కాకుండా బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. చౌకైన ధరలకే వైఫై ప్లాన్లను అందిస్తోంది. ప్రైవేట్ బ్రాడ్‌బ్యాంక్ ప్లాన్ల ధరలు అధికంగా ఉంటాయి. రూ.500 నుంచి వైఫై ప్లాన్లు ప్రారంభమవుతాయి. కానీ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాంక్ కనెక్షన్లను అందిస్తోంది. దీంతో బీఎస్ఎన్‌ఎల్‌ వైఫై కనెక్షన్ తీసుకునేవారి సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లపై ఆఫర్లు ప్రకటిస్తున్న బీఎస్ఎన్‌ఎల్.. న్యూఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.

రూ.399కే బేసిన్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ.399కే బేసిక్ ఫైబర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్నవారికి తొలి నెల ఫ్రీగా సర్వీస్ లభిస్తుంది. ఇక తర్వాత మూడు నెలల పాటు వైఫై రీఛార్జ్‌పై రూ.100 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 60 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ లభించడంతో పాటు నెలకు 3300 బీజీ డేటా పొందవచ్చు. 18004444 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా ‘Hi అని మెస్సేజ్ పంపడం ద్వారా మీరు ఈ ప్లాన్ పొందవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండగా.. ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద రూ.399కి తగ్గించారు. 3300జీబీ వరకు 60 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. ఆ తర్వాత 4 ఎంబీపీఎస్ స్పీడ్ పొందవచ్చు.

రూ.61 రీఛార్జ్‌తో వెయ్యి ఛానెల్స్

ఇక బీఎస్ఎన్ఎల్ IFTV ప్రీమియమ్ ప్యాక్ తీసుకొచ్చింది. దీని ద్వారా సెటాప్ బాక్స్ అవసరం లేకుండా టీవీ ఛానెల్స్ చూడవచ్చు. కేవలం రూ.61 రీఛార్జ్‌తో వెయ్యి ఛానెల్స్ చూడవచ్చు. అలాగే రూ.151తో లైట్ ప్లే హెచ్‌డీ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు హెచ్‌డీ ఛానెల్స్‌ను చూడవచ్చు. ఈ సర్వీస్ యాక్టివ్ చేసుకోవాలంటే 1800 444 నెంబర్‌కు వాట్సప్ ద్వారా మెస్సేజ్ చేయాలి.