Book Gas Through Paytm : ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం ఆకర్షణీయమైన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా గ్యా్స్ యూజర్లు ఐవిఆర్, మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా చేసిన బుకింగ్ కోసం పేటిఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. ఏ ఇతర ప్లాట్‌ఫాం నుంచి సిలిండర్‌ను బుక్ చేసినా Paytm ద్వారా డబ్బులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు పేటిఎం ద్వారా ఎల్‌పిజి సిలిండర్లను బుక్ చేసే వినియోగదారులకు 3 సిలిండర్ బుకింగ్‌లపై రూ .900 వరకు ఫిక్స్‌డ్ క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.
Paytm లో బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్‌పై యూజర్లు Paytm ఫస్ట్ పాయింట్లను పొందుతారు. వీటిని వారి వాలెట్ బ్యాలెన్స్, ప్రసిద్ధ బ్రాండ్ల డిస్కౌంట్ వోచర్‌ల రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. ఇండేన్, హెచ్‌పి, భారత్ 3 ప్రధాన ఎల్‌పిజి కంపెనీల సిలిండర్ బుకింగ్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. Paytm పోస్ట్‌ప్యాడ్‌లో నమోదు చేయడం ద్వారా సిలిండర్ బుక్ చేసి తరువాత కూడా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించింది. Paytm వినియోగదారులు సిలిండర్‌ను బుక్ చేసే ముందు ధరను కూడా తనిఖీ చేయవచ్చు.
కస్టమర్లు తమ గ్యాస్ సిలిండర్ల డెలివరీని ట్రాక్ చేయడానికి, రీఫిల్స్ కోసం ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్‌లను పొందగల సామర్థ్యం కూడా కల్పించింది. ఇది ఇప్పుడు పేటిఎమ్ యాప్ లో అందుబాటులో ఉంది. Paytm LPG సిలిండర్ బుకింగ్ ప్రక్రియను ను చాలా సులభమైన ప్రక్రియగా మార్చింది. వినియోగదారు ‘బుక్ గ్యాస్ సిలిండర్’ టాబ్‌కు వెళ్లి, గ్యాస్ కంపెనీని ఎంచుకుని, మొబైల్ నంబర్ / ఎల్‌పిజి ఐడి / కస్టమర్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై చెల్లింపు చేయాలి. సిలిండర్ సమీప గ్యాస్ ఏజెన్సీ ద్వారా యూజర్ రిజిస్టర్డ్ చిరునామాకు పంపబడుతుంది.