Good News: రైతులకి పెద్ద ఊరట.. మోడీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల సబ్సిడీ..!

|

May 03, 2022 | 7:49 AM

Good News: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం వద్ద యూరియా, డీఏపీ, ఎన్‌పీకే ఎరువులు డిమాండ్‌ కంటే ఎక్కువగానే ఉన్నాయని రసాయనాలు,

Good News: రైతులకి పెద్ద ఊరట.. మోడీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల సబ్సిడీ..!
Fertilizer Subsidy
Follow us on

Good News: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం వద్ద యూరియా, డీఏపీ, ఎన్‌పీకే ఎరువులు డిమాండ్‌ కంటే ఎక్కువగానే ఉన్నాయని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎరువుల కొరతని రానివ్వదని రైతులపై ముడిసరుకు ధరల పెరుగుదల భారాన్ని మోపదని తెలిపారు. ఈ ఏడాది రైతులకు దాదాపు రూ .2.5 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీని అందజేస్తామన్నారు. ప్రతి జిల్లా స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఇంకా ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వాలు బేరీజు వేసుకోవాలని మంత్రి సూచించారు. ఖరీఫ్ సీజన్‌కు రూ.60,939 కోట్ల సబ్సిడీకి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఎరువుల ప్రస్తుత స్థితిగతులను ఆయన సమీక్షించారు.
ఎరువుల స్టాక్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్నారు. ఎరువు నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ లేదా ఎరువులు మళ్లింపు వంటి కేసుల్లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

ఎరువుల శాఖ కార్యదర్శి ఆర్కే చతుర్వేది దేశంలో ప్రస్తుతం ఎరువుల పరిస్థితి గురించి తెలియజేశారు. గత మూడేళ్లలో ఎరువుల వినియోగం, అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగుదల తీరు, గత పదేళ్లలో ఏడాది వారీగా ఎరువుల సబ్సిడీలు, ఎరువుల దిగుమతులకు సంబంధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఒప్పందాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎరువుల మంత్రి మాట్లాడుతూ..
కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెంది అంతర్జాతీయంగా ముడిసరుకు ధరలు పెరిగినా.. రైతులకు ఇబ్బంది కలగకుండా సబ్సిడీని పెంచి ఎరువుల ధరలను అతి తక్కువ ధరలో ఉంచడంలో విజయం సాధించామని తెలిపారు. ప్రస్తుతం ఒక్కో బస్తాకు రూ.2184 చొప్పున యూరియాపై ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది.

రెండేళ్ల క్రితం వరకు ఎరువుల సబ్సిడీ 75 నుంచి 80 వేల కోట్లు మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకు ధరలు పెరగడం వల్ల ఎరువుల వాస్తవ ధర గణనీయంగా పెరుగుతుంది. దీని వల్ల రైతులకు వ్యవసాయం చాలా ఖరీదు అవుతుంది. అందుకే ప్రభుత్వం సబ్సిడీని నిరంతరం పెంచుతోంది. ప్రస్తుతం సబ్సిడీ రూ.1.62 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: తొమ్మిదో తరగతి ఫెయిల్‌.. కానీ ఈ రోజు ఒక సంచలనం.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర..!

Study Tips: చదివేటప్పుడు సంగీతం వినడం మంచిదా.. చెడ్డదా.. వాస్తవం తెలుసుకోండి..!

Viral Video: బాబోయ్‌ ఇవి కూడా బహుమతులేనా.. షాకైన వధూవరులు..!