పానీపూరీ..ఆటో ఇండస్ట్రీ.. నిర్మల వ్యాఖ్యలపై సెటైర్లు !

పానీపూరీ..ఆటో ఇండస్ట్రీ.. నిర్మల వ్యాఖ్యలపై సెటైర్లు !

దేశంలో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, టూ , ఫోర్ వీలర్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకు 1980. 90, 2000 సంవత్సరాల్లో పుట్టిన ఈ దేశంలోని ‘ యంగ్ ఎడల్ట్ యువత ‘ తమ పర్సనల్ వెహికల్ కొనడానికి నెలవారీ ఈ ఎం ఐ చెల్లించే బదులు.. ఓలా , ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడమే కారణమని ఆమె […]

Pardhasaradhi Peri

|

Sep 11, 2019 | 3:42 PM

దేశంలో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, టూ , ఫోర్ వీలర్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకు 1980. 90, 2000 సంవత్సరాల్లో పుట్టిన ఈ దేశంలోని ‘ యంగ్ ఎడల్ట్ యువత ‘ తమ పర్సనల్ వెహికల్ కొనడానికి నెలవారీ ఈ ఎం ఐ చెల్లించే బదులు.. ఓలా , ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడమే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. అంటే వారి మైండ్ సెట్ మారడమేనన్నారు. ఏది..ఏమైనా ఆటోమొబైల్ రంగానికి తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆమె చెప్పారు. అయితే ఈ ‘ నవతరం యువత ‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ యువత ‘ పానీపూరీ ‘ ని ప్రిఫర్ చేస్తోందని, అందువల్లే వారిని ‘ బాయ్ కాట్ ‘ చేయాలని నెటిజన్లు వ్యంగ్య ‘ బాణాలు ‘ విసురుతున్నారు. ‘ ఈ యువత ఉదయంపూట ఎక్కువగా ఆక్సిజన్ పీలుస్తుంటారు కనుక ఆక్సిజన్ సంక్షోభం తలెత్తుతుందని ‘ ఒకరంటే.. ‘ వీళ్ళు పానీపూరీయే కావాలంటారని, ఈ కారణంగానే బీ హెచ్ ఈ ఎల్ పరిస్థితి ఈ 15 ఏళ్లలో దిగజారిపోయిందని ‘ మరొకరు పేర్కొన్నారు. అలాగే… ‘ రొట్టె, పప్పు బదులుగా వీరు పిజ్జాను ప్రిఫర్ చేయడం వల్లే వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతున్నాయని ‘ ఇంకొక నెటిజనుడు వ్యాఖ్యానించాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇదే అదనని నిర్మలా సీతారామన్ పై విరుచుకుపడింది. తనవంతు సెటైర్లు వేసింది. అసలు ఆటోమొబైల్ రంగం ఇంత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బీజేపీయే కారణమని ఆరోపించింది.’ మీరు చెబుతున్నది నిజమే ! నవ యువతను.. అంటే ఓటర్లను మీరు తప్పు పట్టండి.. అందరినీ బ్లేమ్ చేయండి.. కానీ మీ పార్టీ (బీజేపీ) ఈ రంగాన్ని ఎలా హ్యాండిల్ చేస్తోందో అన్నదాన్ని మాత్రం తప్పు పట్టకండి ‘ అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ట్వీట్ చేశారు. బస్సులు, ట్రక్కుల అమ్మకాలు కూడా తగ్గాయంటే.. ఈ వాహనాలను వినియోగించే యువత వీటిని కొనడాన్ని ఆపేశారా అని వ్యంగ్యంగా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎలా చేరుస్తారని కూడా ఆయన ట్వీటించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu