AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Safety Car: భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌

అందుకే ఏ కారైనా సేఫ్టీ ర్యాంకింగ్‌ను దాటుకొని మార్కెట్లోకి రావాల్సిందే. దీనినే క్రాష్‌ టెస్ట్ అంటారు. ఇందులో భాగంగా మార్కెట్లోకి వచ్చే ముందు కారును క్రాష్‌ టెస్ట్ చేస్తారు. ఇందులో టాప్‌లో నిలిచిన కారును ప్రకటిస్తుంటారు. తాజాగా నిర్వహించిన ఈ క్రాష్‌ టెస్ట్‌లో గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్ GNCAP టాటా నెక్సాన్‌ను బెస్ట్ ఈవీ ఎస్‌యూవీగా ప్రకటించింది...

Safety Car: భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
Safety Car
Narender Vaitla
|

Updated on: Jun 18, 2024 | 7:31 AM

Share

ఏదైనా కొత్త కారు కొనుగోలు చేసే ముందు మనలో చాలా మంది మొదట చూసేది కారులో ఉండే ఫీచర్స్‌ అయితే రెండోది కారు భద్రత. అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలను నిలబెట్టే కారు కోసం చూస్తారు. ముఖ్యంగా ఎక్కువగా జర్నీలు చేసే వారు, వేగంగా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకునే వారు భద్రతకు పెద్ద పీట వేస్తుంటారు. ఇందులో భాగంగానే కారు బ్రేకింగ్ సిస్టమ్‌, ఎయిర్‌ బ్యాగ్స్‌తోపాటు క్రాష్‌ టెస్ట్‌లో కారు సాధించిన ర్యాంకింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.

అందుకే ఏ కారైనా సేఫ్టీ ర్యాంకింగ్‌ను దాటుకొని మార్కెట్లోకి రావాల్సిందే. దీనినే క్రాష్‌ టెస్ట్ అంటారు. ఇందులో భాగంగా మార్కెట్లోకి వచ్చే ముందు కారును క్రాష్‌ టెస్ట్ చేస్తారు. ఇందులో టాప్‌లో నిలిచిన కారును ప్రకటిస్తుంటారు. తాజాగా నిర్వహించిన ఈ క్రాష్‌ టెస్ట్‌లో గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్ GNCAP టాటా నెక్సాన్‌ను బెస్ట్ ఈవీ ఎస్‌యూవీగా ప్రకటించింది. పెద్దలతో పాటు, చిన్నారులకు టాటా నెక్సాన్‌ ఈవీ ఎస్‌యూవీని బెస్ట్‌ కారుగా తెలిపింది.

Tata Nexon Ev Suv

ఈ కారుకు ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం విశేషం. టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీకు పెద్దల విషయంలో 30 పాయింట్లకు 29.86 ఇచ్చింది. ఇక పిల్లల ఆక్సుపెన్సీ సేఫ్టీ విషంయోల 49 పాయింట్లకు 44.95 ఇచ్చింది. దీంతో ఈ కారుకు భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్ లభించింది. 18 ఏళ్ల పిల్లల సేఫ్టీ విషంయలో 12 పాయింట్లకు 11.95 వచ్చాయి. మూడేళ్ల పిల్లల వి,యంలో 12 కు 12 పాయింట్లు లభించాయి. అలాగే ఒకవేళ ప్రమాదం జరిగితే ముందు కూర్చునే వాళ్లను ప్రమాదం నుంచి ఏ మేరకు కాపాడవచ్చో తెలిపేందుకు నిర్వహించే సైడ్ పోల్, ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా ఈకారుకు మంచి స్కోర్ దక్కింది. ఇందులో 16 పాయింట్లకు 14.26 దక్కాయి. ఇది గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు చేసిన పరీక్ష.

ఇక టాటా నెక్సాన్‌ ఈవీ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, రివర్సింగ్ కెమేరా విత్ రేర్ పార్కింగ్ సెన్సార్‌లను అందించారు. అలాగే 360 డిగ్రీలు వ్యూ సిస్టమ్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, రేర్ డిస్క్ బ్రేక్స్ , ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈవీ ధర విషయానికొస్తే రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల రేంజ్లో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!