Equity Mutual Funds: పిల్లల భవిష్యత్‌ కోసం పెట్టుబడికి అవే బెటర్‌.. నమ్మలేని రాబడి మీ సొంతం

భారతదేశంలో ద్రవ్యోల్బణం రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతం లక్ష్యాన్ని అధిగమించడంతో, ఆర్థిక పరిమితులు ఈ ఆకాంక్షలను సాధించడంలో సవాళ్లు ఎదురవుతాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ అడ్డంకులను అధిగమించడానికి విద్య, వివాహానికి సంబంధించిన గణనీయమైన ఖర్చులను కవర్ చేసేలా నిధుల సృష్టిని నిర్ధారించడానికి తల్లిదండ్రులు వ్యూహాత్మక, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో నిమగ్నమై ఉండాలి.

Equity Mutual Funds: పిల్లల భవిష్యత్‌ కోసం పెట్టుబడికి అవే బెటర్‌.. నమ్మలేని రాబడి మీ సొంతం
Business Idea
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2024 | 9:30 AM

తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ అవకాశాలను అందించాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి విద్యతో పాటు వారి అన్ని అవసరాలను తీర్చాలని కోరుకుంటారు. అయితే భారతదేశంలో ద్రవ్యోల్బణం రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతం లక్ష్యాన్ని అధిగమించడంతో, ఆర్థిక పరిమితులు ఈ ఆకాంక్షలను సాధించడంలో సవాళ్లు ఎదురవుతాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ అడ్డంకులను అధిగమించడానికి విద్య, వివాహానికి సంబంధించిన గణనీయమైన ఖర్చులను కవర్ చేసేలా నిధుల సృష్టిని నిర్ధారించడానికి తల్లిదండ్రులు వ్యూహాత్మక, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో నిమగ్నమై ఉండాలి. అలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు తల్లిదండ్రులు పరిగణించాల్సిన ఐదు కీలక అంశాలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

వ్యయ పర్యవేక్షణ

విద్యా ఖర్చులలో వార్షికంగా 12 శాతం పెరుగుదల ఉంటుంది. అంటే పెట్టుబడి సమంయలో తల్లిదండ్రులు భవిష్యత్తు ఖర్చులను కచ్చితంగా అంచనా వేయాలి. ఉదాహరణకు నేడు విద్యకు రూ.లక్ష కేటాయిస్తే ఆరేళ్లలో రూ.2 లక్షలకు పెరగవచ్చు. ఈ దూరదృష్టి పెట్టుబడి పెట్టడానికి సరైన మొత్తాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఎంచుకున్న పెట్టుబడి ప్రణాళికపై సరైన రాబడిని అందిస్తుంది.

ప్రారంభ పెట్టుబడి:

ముందుగా పెట్టుబడులు ప్రారంభించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు మెరుగైన రేట్ల నుండి ప్రయోజనం పొందుతారు. అలాగే వారి పిల్లల భవిష్యత్తు కోసం వ్యూహాత్మక పెట్టుబడులు చేయడంలో మరింత సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులను ఆలస్యం చేయడం వల్ల లాభదాయకమైన వెంచర్‌లను భద్రపరచడానికి అధిక నిధులు అవసరం కావచ్చు.  

ఇవి కూడా చదవండి

సరైన పెట్టుబడి ఎంపిక

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రణాళిక కోసం ఒక వ్యూహాత్మక చర్య. ఈ ఫండ్‌లు వివిధ పరిశ్రమ రంగాలలో వివిధ రకాల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ డైవర్సిఫికేషన్‌ను అందిస్తాయి, సమతుల్యమైన, లాభదాయకమైన పోర్ట్‌ఫోలియోకు భరోసా ఇస్తాయి.

ఆర్థిక క్రమశిక్షణ

ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం విజయవంతమైన దీర్ఘకాలిక ప్రణాళికకు మూలస్తంభం. నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడం, వారి పురోగతిని ట్రాక్ చేయడం, బడ్జెట్‌లను రూపొందించడం, అత్యవసర నిధులతో సహా పొదుపులను ఏర్పాటు చేయడం ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంలో అంతర్భాగాలుగా ఉంటాయి.

పెట్టుబడుల వైవిధ్యం

దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. పోర్ట్‌ఫోలియోను మరింత వైవిధ్యపరచడానికి, మొత్తం ఆర్థిక వ్యూహాన్ని మెరుగుపరచడానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..