AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్‌ టీమ్‌లో కీలక వ్యక్తులు ఎవరో తెలుసా..?

బడ్జెట్ తయారీ ప్రక్రియ ఆరు నెలల ముందుగానే ప్రారంభమవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపడమే కాకుండా వివిధ పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి బడ్జెట్‌ను ఖరారు చేస్తారు. బడ్జెట్ తయారీ అనేది ఒక వ్యక్తి మాత్రమే కాదు, వివిధ శాఖల ఉమ్మడి కృషి. ఈ మధ్యంతర బడ్జెట్‌లో చాలా మంది కృషి ఉంటుంది. వీరిలో కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ శ్రీవాస్తవ..

Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్‌ టీమ్‌లో కీలక వ్యక్తులు ఎవరో తెలుసా..?
Nirmala Sitharaman
Subhash Goud
|

Updated on: Jan 17, 2024 | 9:24 AM

Share

వచ్చే నెల మొదటి తేదీన (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నందున ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే. అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించడానికి అవసరమైన పని మధ్యంతర బడ్జెట్‌కు కూడా అవసరం.

బడ్జెట్ తయారీ ప్రక్రియ ఆరు నెలల ముందుగానే ప్రారంభమవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపడమే కాకుండా వివిధ పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి బడ్జెట్‌ను ఖరారు చేస్తారు.

బడ్జెట్ తయారీ అనేది ఒక వ్యక్తి మాత్రమే కాదు, వివిధ శాఖల ఉమ్మడి కృషి. ఈ మధ్యంతర బడ్జెట్‌లో చాలా మంది కృషి ఉంటుంది. వీరిలో కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ శ్రీవాస్తవ కూడా ఒకరు.

ఇవి కూడా చదవండి

కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అధికారులు:

  • నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి
  • సంజయ్ మల్హోత్రా, రెవెన్యూ కార్యదర్శి
  • అజయ్ సేథ్, కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ
  • తుహిన్ కాంత పాండే, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్
  • వివేక్ జోషి, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
  • టి.వి. సోమనాథన్, సెక్రటరీ, ఆర్థిక శాఖ
  • వి అనంత నాగేశ్వరన్, ముఖ్య ఆర్థిక సలహాదారు
  • పీకే మిశ్రా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ
  • అరవింద్ శ్రీవాస్తవ, అదనపు కార్యదర్శి, PMO
  • పుణ్య సలీల శ్రీవాస్తవ, అదనపు కార్యదర్శి, PMO
  • హరిరంజన్ రావు, అదనపు కార్యదర్శి, PMO
  • అతిష్ చంద్ర, అదనపు కార్యదర్శి, PMO
  • ఈ జాబితాలోని చివరి ఐదుగురు ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తులు.

అరవింద్ శ్రీవాస్తవ కర్ణాటక కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ అయిన ఆయన PMOలో ఫైనాన్స్ అండ్ ఎకనామిక్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

టీమ్‌లో పీకే మిశ్రా కీలకం

ఈ పై టీమ్‌లో అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తి పీకే మిశ్రా. ప్రభుత్వ ముఖ్యమైన విధానాలన్నింటినీ ఆయన పర్యవేక్షిస్తారు. ఈ ఐఏఎస్ అధికారికి కేబినెట్ గ్రేడ్ హోదా కల్పించారు. అతను వివిధ మంత్రిత్వ శాఖల గురించి, వాటి నుండి సమాచారాన్ని ప్రధానమంత్రికి అందజేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని పారిపాలనకు పీకే మిశ్రా కీలక వ్యక్తి అని చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి