AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Tax Avoid: మీరు టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేయాలనుకుంటున్నారా? గూగుల్‌ మ్యాప్‌లో అద్భుతమైన ఫీచర్‌

టోల్‌ ట్యాక్స్‌ను నివారించేందుకు గూగుల్‌ మ్యాప్స్‌లో ప్రత్యేక ఫీచర్‌ ఉంది. మీరు Google మ్యాప్స్ ద్వారా లొకేషన్‌ను చేరుకోవడానికి మార్గం కోసం సెర్చ్‌ చేయండి. అప్పుడు మీకు లోకేషన్‌ మార్గం చూపిస్తుంది. ఇందులో మీరు దారిలో ఉండే టోల్ ప్లాజాల వివరాలను కనిపిస్తాయి. అంటే మీరు వెళ్లే మార్గంలో ఏయే ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు..

Toll Tax Avoid: మీరు టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేయాలనుకుంటున్నారా? గూగుల్‌ మ్యాప్‌లో అద్భుతమైన ఫీచర్‌
Toll Plaza
Subhash Goud
|

Updated on: Jan 16, 2024 | 12:50 PM

Share

ప్రతి ఒక్కరూ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే టోల్ టాక్స్ చెల్లించే విషయంలో ఒత్తిడి తలెత్తుతుంది. భారతదేశంలో టోల్ ట్యాక్స్ అనేది సాధారణ విషయం. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. తరచుగా ప్రజలు ఒకేసారి అనేక టోల్ ప్లాజాలను దాటవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో టోల్ పన్ను మొత్తం చాలా ఎక్కువ అవుతుంది. మీరు టోల్ ఖర్చులను వదిలించుకోవాలనుకుంటే మీరు Google ప్రత్యేక సేవను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ మ్యాప్స్‌లో కొంచెం పని చేయాల్సి ఉంటుంది.

టోల్‌ ట్యాక్స్‌ను నివారించేందుకు గూగుల్‌ మ్యాప్స్‌లో ప్రత్యేక ఫీచర్‌ ఉంది. మీరు Google మ్యాప్స్ ద్వారా లొకేషన్‌ను చేరుకోవడానికి మార్గం కోసం సెర్చ్‌ చేయండి. అప్పుడు మీకు లోకేషన్‌ మార్గం చూపిస్తుంది. ఇందులో మీరు దారిలో ఉండే టోల్ ప్లాజాల వివరాలను కనిపిస్తాయి. అంటే మీరు వెళ్లే మార్గంలో ఏయే ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు. అయితే మీరు టోల్‌ నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గాలను కూడా ఎంచుకోవచ్చు. అయితే అందుకు కొన్ని ఆప్షన్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

టోల్ టాక్స్ నుండి తప్పించుకోవడానికి ఇలా చేయండి

టోల్ ట్యాక్స్‌ను నివారించడానికి, గూగుల్ మ్యాప్స్‌ను ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ఈ దశలను అనుసరించాలి

ఇవి కూడా చదవండి
  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Google మ్యాప్స్ యాప్‌ను తెరవండి.
  • మీరు వెళ్లాలనుకుంటున్న స్థలం, చిరునామా లేదా పేరును నమోదు చేయండి.
  • తర్వాత డైరెక్షన్‌పై క్లిక్‌ చేయండి
  • ఇప్పుడు మీరు మీ స్థానాన్ని ఎంచుకోవాలి.
  • ఎగువన ఉన్న రవాణా ఆప్షన్‌ను ఎంచుకోండి. ఉదాహరణకు కారు
  • ప్రక్కన ఉన్న మూడు చుక్కల మెనుని నొక్కండి.
  • దీని తర్వాత టోల్‌లను నివారించే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు టోల్‌ప్లాజా లేని మార్గం కనిపిస్తుంది.

టోల్ ప్లాజాలు లేని మార్గాలను Google Maps మీకు చూపుతుంది. అయితే కొన్ని రూట్లలో టోల్ ట్యాక్స్‌ను ఆదా చేయడానికి మీరు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు షార్ట్‌కట్‌ రూట్లు ఉంటాయి. ఆ దారి గుండా వెళితే సమయం, దూరం కూడా తగ్గవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్