Post Office: పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!

|

Jul 09, 2021 | 11:29 AM

సామాన్యుల కోసం పోస్టాఫీసులు ఎన్నో రకాల స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పధకాల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందొచ్చు..

Post Office: పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!
Post Office
Follow us on

సామాన్యుల కోసం పోస్టాఫీసులు ఎన్నో రకాల స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పధకాల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందొచ్చు. ఆ స్కీంలలో ఉత్తమమైనది రికరింగ్ డిపాజిట్ స్కీం. ఈ పధకం పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. తక్కువ మొత్తం జమతో ఎక్కువ ఫండ్ పొందడమే ఈ స్కీం ప్రధాన లక్ష్యం. ఈ పొదుపు పధకానికి 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో మీరు ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. మీరు రూ. 2 వేలతో ఖాతా తెరిచి 5 సంవత్సరాల పాటు జమ చేస్తూ వస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.1,39,395 లభిస్తుంది.

ఇలా రూ .1.39 లక్షలు పొందవచ్చు…

ఈ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకం ప్రాథమిక మంత్రం ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత తేదీలో జమ చేయడం. మీరు 5 సంవత్సరాల పాటు ప్రతీ నెలా 2000 రూపాయలు జమ చేస్తే, 60 నెలల్లో మీరు సుమారు రూ. 1.20 లక్షలు జమ చేసినట్లు, దానిపై మీకు 5.8 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఇది సుమారు రూ.19,395 వస్తుంది. ఈ విధంగా, మీరు కేవలం రూ.2000 జమ చేయడం ద్వారా మెచ్యూరిటీకి రూ.1,39,395 పొందవచ్చు.

ఎక్కువగా జనాదరణ పొందిన పోస్టాఫీసు పధకాలు ఇవే..

తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పధకాలు ఎన్నో పోస్టాఫీసులు అందుబాటులోకి తీసుకొచ్చాయి. దానిలో తొమ్మిది పధకాలు ఎక్కువ జనాదరణ పొందాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సుకన్య యోజన స్కీంలు ఆ లిస్టులో ఉన్నాయి.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!