Hybrid Cars: ఎలక్ట్రిక్, పెట్రోల్.. రెండింటితో నడిచే హైబ్రిడ్ కార్స్! మార్కెట్లో ఇప్పుడు వీటిదే హవా!

కేవలం పెట్రోల్ తో నడిచే కారు చూశాం. పూర్తిగా ఎలక్ట్రిక్ తో నడిచే కార్లనూ చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ కార్స్ వస్తున్నాయి. అంటే వీటిలో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటర్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో వీటిదే హవా! వీటి గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Hybrid Cars: ఎలక్ట్రిక్, పెట్రోల్.. రెండింటితో నడిచే హైబ్రిడ్ కార్స్! మార్కెట్లో ఇప్పుడు వీటిదే హవా!
Hybrid Cars

Updated on: Oct 07, 2025 | 3:46 PM

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్ కార్ల హవా నడుస్తోంది. పెట్రోల్/డీజిల్ ఇంజిన్ కమ్ ఎలక్ట్రిక్ మోటర్ కాంబినేషన్ తో కార్లు రెడీ అవుతన్నాయి. కారు డ్రైవ్ చేస్తూనే..  మనకు కావాల్సినప్పుడు పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ కు, ఎలక్ట్రిక్ నుంచి పెట్రోల్ కు మారిపోవచ్చు. ఈ హైబ్రిడ్ సిస్టమ్ వల్ల కారు మరింత ఎక్కువ మైలేజీ పొందుతుంది. అందుకే ఇప్పుడు అందరూ ఇలాంటి కార్లనే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ హైబ్రైడ్ కార్స్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే..

గ్రాండ్ విటారా

మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు ఇండియాలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ గా కంపెనీ చెప్తోంది. ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది లీటర్‌కు సుమారు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్ లో ఎలక్ట్రిక్ మోడ్, హైవేపైన పెట్రోల్ తో నడపొచ్చు. ఇందులో ప్రీమియం ఇంటీరియర్‌తో పాటు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు  ధర రూ.16 లక్షల నుంచి మొదలవుతుంది.

హోండా సిటీ– ఇ

హోండా సిటీలో కొత్తగా ‘ఇ’ వేరియంట్.. స్ట్రాంగ్ హైబ్రైడ్ మోడల్ కారు. ఇందులో పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ కు, ఎలక్ట్రిక్ నుంచి పెట్రోల్ కూ ఈజీగా మారొచ్చు.  ఇది లీటర్‌కు సుమారు 27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో పాటు లుక్ కూడా ప్రీమియంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.19.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఇన్నోవా హైక్రాస్

టయోటా ఇన్నోవాలో కొత్తగా వచ్చిన హైక్రాస్ మోడల్ స్ట్రాంగ్ హైబ్రీడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రీమియం 7 సీటర్ ఎస్ యూవీ. ఇది పెద్ద కారు అయ్యుండి కూడా లీటర్‌కు 23 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ట్రాఫిక్‌లో ఆటోమేటిక్ గా ఈవీ డ్రైవింగ్‌కు స్విచ్ అవుతుంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.25.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి ఇన్విక్టో

మారుతి సుజుకి ఇన్విక్టో కూడా 7 సీటర్ కారు.  దీని ధర రూ.24.97 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో పెట్రోల్ కమ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంది. ఇది లీటర్‌కు 23 కిమీ మైలేజ్ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Follow Us