Business Idea: జీతం సరిపోవడం లేదా.? ఇంట్లో చేసే ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం
మరి ఇంట్లోనే ఉంటూ, మీ ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉంటే భలే ఉంటుంది. కదూ! అందులోనూ తక్కువ వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జించే ఛాన్స్ ఉంటే. ఇప్పుడు ఇలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టగొడుగుల పెంపంకం ఇప్పుడు ఒక మంచి వ్యాపారంగా మారింది...

వ్యాపారం చేయాలనే ఆలోచనలో మనలో చాలా మందికి ఉన్నా. నష్టాలు వస్తాయేమో అనే భయంతో ఆ ఆలోచనను విరమించుకుంటారు. ఇక పెట్టుబడికి కూడా వ్యాపారం చేయరు. అయితే ఉద్యోగం చేస్తే వచ్చే జీతం అన్ని సందర్భాల్లో సరిపోదు. పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రతీ ఒక్కరూ దారులు వెత్తుకుంటారు.
మరి ఇంట్లోనే ఉంటూ, మీ ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉంటే భలే ఉంటుంది. కదూ! అందులోనూ తక్కువ వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జించే ఛాన్స్ ఉంటే. ఇప్పుడు ఇలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టగొడుగుల పెంపంకం ఇప్పుడు ఒక మంచి వ్యాపారంగా మారింది. పుట్టగొడుగుల పెంపకానికి చిన్న గది ఉంటే చాలు. కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. భారీగా లాభాలు ఆర్చించవచ్చు.
ఈ వ్యాపారం ప్రారంభించాలంటే చిన్న గది ఉంటే చాలు.. చదరపు మీటరుకు 10 కిలోల పుట్టగొడుగులను సులభంగా సాగు చేయవచ్చు. కనీసం 40×30 అడుగుల స్థలంలో మూడు అడుగుల వెడల్పు గల మూడు రాక్‌లను ఏర్పాటు చేసి..కవర్లలో పుట్టగొడులను పెంచవచ్చు. ఇక పుట్టగొడుల పెంపకానికి కంపోస్ట్ కూడా అవసరపడుతుంది. కంపోస్ట్‌ను కూడా సహజ పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి కొన్ని సంస్థలు శిక్షణ సైతం అందిస్తున్నాయి.
అలాగే ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న వారికి సంబంధించిన వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయి. అందులో పుట్ట గొడుగుల పెంపకానికి సంబంధించిన అన్ని వివరాలను సవివరంగా తెలిపారు. వీటితో పాటు వ్యవసాయ కేంద్రాలను సంప్రదించడం ద్వారా కూడా పుట్ట గొడుగులకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. రూ. 50 వేల ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభింవచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 10 వేల నుంచి దీర్ఘకాలంలో రూ. 50 వేల వరకు ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..