Instant Loan Apps: ఆ లోన్‌యాప్స్‌తో జర జాగ్రత్త.. ఇబ్బందులు తప్పాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

ఇటీవల కాలంలో తక్షణ రుణ యాప్‌లు ఆర్థిక అవసరాలు, అత్యవసర పరిస్థితులకు శీఘ్ర పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో ప్రజల అవసరాన్నే అవకాశంగా మార్చుకుని వివిధ యాప్స్ ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ యాప్స్ బారిన పడి మోసపోతున్నారు.

Instant Loan Apps: ఆ లోన్‌యాప్స్‌తో జర జాగ్రత్త.. ఇబ్బందులు తప్పాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!
Loan Apps

Updated on: May 30, 2024 | 6:02 PM

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. అలాగే పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునే వారు కూడా పెరిగారు.ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు ఆర్థిక అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని కొంతమంది అనుకుంటున్నారు.  యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో ప్రజల అవసరాన్నే అవకాశంగా మార్చుకుని వివిధ యాప్స్ ముందుకు వచ్చాయి. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లు చాలా మంది ఈ యాప్స్ బారిన పడి మోసపోతున్నారు. కాబట్టి ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో లోన్ పొందే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకందాం. 

యాప్ గుర్తింపు

చట్టపరమైన ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల వంటి ఆన్‌లైన్ ఉనికితో పాటు వివిధ ఫ్లాట్ ఫారమ్స్‌లో ప్రకటనలు ఇస్తూ  ఉంటాయి.  ఈ నేపథ్యంలో లోన్ యాప్‌లు మోసాల బారిన పడకుండా ఉండటానికి, ఎల్లప్పుడూ ధ్రువీకరించిన యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌నకు సంబంధించిన ఇతర వివరాలను అంచనా వేయడానికి ప్రసిద్ధ మీడియా అవుట్‌లెట్‌ల నుంచి వార్తా కథనాలు లేదా సమీక్షల కోసం తనిఖీ చేయడం మంచిది. 

రెగ్యులేటరీ అప్రూవల్

మీరు లోన్ తీసుకునే యాప్  ఆర్‌బీఐ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్‌తో భాగస్వామ్యమైందని లేదా నేరుగా ఆర్‌బీఐ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవాలి. ఇలాంటి యాప్‌లు నియంత్రణకు కట్టుబడి ఉంటాయి. రుణదాతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్థితిని నిర్ధారించడానికి ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించడం ఉత్తమం. 

ఇవి కూడా చదవండి

డేటా రక్షణ

లెండింగ్ యాప్‌లు తమ డేటాను యాక్సెస్ చేయడానికి రుణగ్రహీతల నుంచి తప్పనిసరిగా సమ్మతిని పొందాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, ఏవైనా ఇతర అవసరమైన సౌకర్యాలతో సహా కేవైసీ విధానాల కోసం రుణ యాప్ రుణగ్రహీతల డేటాను ఒకసారి యాక్సెస్ చేయగలదు.

సమాచారం

రీ పేమెంట్ నిబంధనలు, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య చెల్లింపు ఛార్జీలను ముందస్తుగా వెల్లడించే యాప్స్‌లో లోన్ తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆర్‌బీఐ ప్రాతినిధ్యం వహించే బ్యాంక్(లు) లేదా ఎన్‌బీఎఫ్‌సీ పేరును వెల్లడించడానికి డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లను తప్పనిసరి చేస్తుంది. ఫిన్‌టెక్ యాప్ లేదా ఇన్‌స్టంట్ లోన్ యాప్ ద్వారా రుణాలను అందించే ఏదైనా ఆర్థిక సంస్థ రుణం మంజూరు చేయడానికి ముందు రుణం తీసుకునే వారికి అన్ని వివరాలను అందించాలి.

లోన్ అందజేత

మంజూరైన రుణం తప్పనిసరిగా ఎలాంటి  ఖాతాలతో సంబంధం లేకుండా రుణగ్రహీత బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయాలి. రుణాన్ని అందించడానికి బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా రుణం ఇస్తేనే ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..