Car Loans: ప్రస్తుతం కార్ల హవా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కార్లను కొనేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, అందుబాటు ధరలోనే కార్లు లభిస్తుండటంతో మధ్య తరగతి వర్గాలు కూడా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్లపై వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుండటం కూడా వారికి కలిసి వస్తోంది. అయితే ఆయా బ్యాంకులు వడ్డీని నిర్ణయించే క్రమంలో మీ నెలవారీ జీతం, వృత్తి, ప్రస్తుతం ఈఎంఐ, క్రెడిట్ స్కోరు వంటి విషయాలను ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇక వివిధ బ్యాంకులు కార్లపై తక్కువ వడ్డీకే లోన్లను అందిస్తోంది. ఇక కారుపై రుణం పొందాలంటే ఎలాంటి నియమాలున్నాయో చూద్దాం.
మీ కారు ఎక్స్ షోరూమ్ ధరలో 20 శాతం డౌన్ పేమెంట్ పెట్టి కొనుగోలు చేయడం ఎల్లప్పుడు స్మార్ట్ ఆలోచన. చాలా బ్యాంకులు కారు ఎక్స్-షోరూమ్ విలువలో 100% వరకు రుణాలు అందిస్తాయి. అయినా సరే, 20% డౌన్‌పేమెంట్ కట్టి రుణం తీసుకోవడం మంచిది. తద్వారా మీ నెలవారీ EMI చెల్లింపు విలువ తగ్గుతుంది. కారు కొనుగోలు చేసిన వారు చాలా కాలంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. వాటి చెల్లింపుల ముందు ఆర్థికంగా లెక్కలు వేసుకోవడం మంచిది. నెలవారీ భారం ఎక్కవైన సరే తక్కువ కాలం పాటు ఈఎంఐలను ఎంచుకోవడం బెటర్. దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం ద్వారా వడ్డీ భారం ఎక్కువ అవుతుందని గుర్తించుకోవాలి. అందుకే తక్కువ కాలం ఈఎంలను ఎంచుకుంటే వడ్డీ రేటు తక్కువ పడుతుంది. అంతేకాదు త్వరగా ఈఎంఐలు క్లియర్ చేసుకోవచ్చు.
కారుపై రుణం ఇవ్వడానికి బ్యాంకులు వేర్వేరు నిబంధనలను అనుసరిస్తాయి. సాధారణంగా అన్ని బ్యాంకులు వారి క్రెడిట్ స్కోర్‌తో పాటు వృత్తి, నెలవారీ ఆదాయాన్ని పరిశీలించి వడ్డీ నిర్ణయిస్తాయి.
►దరఖాస్తు దారుడు 18 నుంచి 75 ఏళ్ల వయసులో ఉండాలి.
► వారి కనీస నెలవారీ వేతనం రూ.20 వేలు ఉండాలి.
► ప్రస్తుత యాజమాన్యంలో కనీసం ఏడాది నుంచి పని చేస్తూ ఉండాలి.
► తప్పనిసరిగా జీతం లేదా స్వయం ఉపాధి గల వ్యక్తి అయి ఉండాలి.
► కొత్త కారు కొనుగోలు చేసేందుకు లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్సమర్పించాల్సి ఉంటుంది.
► ఐడెంటిటీ ప్రూఫ్: పాన్, పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి కార్డ్, అలాగే రెసిడెన్స్ ఫ్రూప్స్.. పాస్‌పోర్ట్. ఆధార్, యుటిలిటీ బిల్లులు, రేషన్ కార్డ్. ఇక ఇన్‌కమ్ ఫ్రూప్ గత మూడు నెలల వేతన స్లిప్స్, ఫారం 16, తాజా ఐటీ రిటర్న్స్, గత 6 నెలలుగా బ్యాంక్ స్టేట్ మెంట్ తప్పనిసరి.
ఇండియాలోని అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీరేటుకే కారు లోన్లను అందిస్తున్నాయి. మిగతా అన్ని బ్యాంకులతో పోలిస్తే రూ.10 లక్షల కారులోన్పై పంజాబ్ మరియు సింథ్ బ్యాంక్ 7.1 శాతం వడ్డీ రేటునే వసూలు చేస్తోంది.
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!