Cheap Gold loan: భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి. సాధారణంగా ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉన్నప్పుడు లేదా అనుకోకుండా డబ్బు అవసరమైనపుడు అందరికీ గుర్తొచ్చేంది వారి వద్ద ఉండే బంగారమే. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడంలో బంగారానికి మించింది లేదని చెప్పడం అతిశయోక్తి కాదు.. అటువంటి సమయంలో బంగారాన్ని, బంగారు ఆభరణాలను తనఖా పెట్టి ఏదైన బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ వద్ద నుంచి సులువుగా గోల్ట్ లోన్ పొందవచ్చు. తక్కువ కాలానికి లోన్ కావాలనుకునే వారికి పర్సనల్ లోన్ కంటే గోల్ట్ లోన్ సరైన ఎంపిక. ఎందుకంటే పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీకే బంగారంపై లోన్ పొందవచ్చు.. అది కూడా వేగవంతంగా. ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ వడ్డీకే బంగారంపై లోన్ అందిస్తున్న బ్యాంకులు ఇవే..
1. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. వడ్డీ రేటు – 7.00%.. ప్రాసెసింగ్ ఛార్జీలు- రూ. 500 నుంచి రూ. 2000 + జీఎస్టీ
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేటు- 7.00%-7.50%.. ప్రాసెసింగ్ ఛార్జీలు- 0.50% + జీఎస్టీ
3. పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్.. వడ్డీ రేటు- 7.00%-7.50%.. ప్రాసెసింగ్ ఛార్జీలు- రూ. 500 నుంచి రూ. 10,000
4. యూనియన్ బ్యాంక్.. వడ్డీ రేటు- 7.25%-8.25%
5. కెనరా బ్యాంక్.. వడ్డీ రేటు- 7.35%.. ప్రాసెసింగ్ ఛార్జీలు- రూ.500 నుంచి 5000
6. ఇండియన్ బ్యాంక్.. వడ్డీ రేటు- 7.50%-8%.. ప్రాసెసింగ్ ఛార్జీలు- 0.56%(అర్హత పొందిన పూర్తి లోన్ ఎమౌంట్)
మార్కెట్ విలువపై రుణం ఎంత ఇస్తారంటే..
సాధారణంగా లోన్ గడువు 24 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. గోల్ట్ అసలు మార్కెట్ విలువలో ఎంత శాతం లోన్ ఇస్తారు అనే అంశం వివిధ బ్యాంకులకు ప్రత్యేక నియమనిబంధనలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా మార్కెట్ విలువలో 75 నుంచి 90 శాతం వరకు బ్యాంకులు లోన్ ఇస్తుంటాయి. ఒకవేళ లోన్ తీసుకున్న తరువాత కాలపరిమితికి ముందే పూర్తి చెల్లింపులు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. దానికి అదనంగా ఛార్జీలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ కూడా ఉంటాయి.
రుణం పొందడానికి ఇవి కావాలి..
బంగారంపై రుణం పొందడానికి పాన్, ఆధార్, ఓటర్ ఐడి, పాస్ పోర్టు, ఓటరు కార్డు వంటి అడ్రస్ ఫ్రూప్ లను బ్యాంకింగ్ సంస్థలు రుణగ్రహీత నుంచి తీసుకుంటాయి. వీటికి తోడు వారి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకేమైమా రుణానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను అడిగే అవకాశం ఉంటుంది.
ఒకవేళ లోన్ సమయానికి చెల్లించకపోతే ఏమి జరుగుతుంది..
ముందుగా బ్యాంకు నుంచి రుణ గ్రహీతకు మెసేజ్, మెయిల్ ద్వారా లోన్ చెల్లింపుల గురించి సమాచారం అందిస్తారు. లోన్ సమయం ముగియడంతో అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన మెుత్తానికి కలుపుతారు. అనేక మార్లు రుణగ్రహీతకు లోన్ చెల్లింపుల గురించి సమాచారం ఇచ్చినప్పటికీ చెల్లింపులు చేయకపోతే.. నిర్ణీత గడువు తరువాత తాఖట్టులో ఉన్న బంగారాన్ని, బంగారు ఆభరణాలను సదరు సంస్థ అమ్మి సొమ్మును లోన్ బకాయికి సర్దుబాటు చేయటం జరుగుతుంది.
ఇవీ చదవండి…
Gold Loan: బంగారంపై రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు..
Credit Score: క్రెడిట్ కార్డుల వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!