Banking News: ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు విడుదల.. నికర లాభం రెండింతలు..!

|

Feb 06, 2022 | 6:43 AM

Banking News: బ్యాంకులకు ప్రతి ఏడాది భారీ ఎత్తున లాభాలు వస్తుంటాయి. వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ, ఇతర ఆదాయాల కారణంగా..

Banking News: ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు విడుదల.. నికర లాభం రెండింతలు..!
Follow us on

Banking News: బ్యాంకులకు ప్రతి ఏడాది భారీ ఎత్తున లాభాలు వస్తుంటాయి. వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ, ఇతర ఆదాయాల కారణంగా లాభాలు పొందుతున్నాయి. ఇక  ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తన త్రైమాసిక ఫలితాలను (Q3 Results) శనివారం విడుదల చేసింది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రెండింతలు పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 14 శాతం పెరిగింది. సంవత్సరంలో బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. NPAలలో తగ్గుదల ఉంది. ఈ త్రైమాసికంలో వాహన రుణాలు 20 శాతానికి పైగా పెరిగాయి. మొత్తం రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియో 11 శాతం పెరిగింది.

గణాంకాల ప్రకారం.. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.1061 కోట్ల నుంచి రూ.2197 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 14.38 శాతం వృద్ధితో రూ.8552 కోట్ల స్థాయికి చేరుకుంది. వడ్డీ ఆదాయం అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో రూ.17,496.71 కోట్ల నుంచి రూ.17,963 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ గత ఏడాదితో పోలిస్తే 36 బేసిస్ పాయింట్లు పెరిగి 3.13 శాతానికి చేరుకుంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ ఇతర ఆదాయంలో క్షీణత కనిపించింది. ఈ త్రైమాసికంలో ఇతర ఆదాయం 13 శాతం క్షీణించి రూ.2519 కోట్లకు చేరుకుంది.

త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఉంది. స్థూల ఎన్‌పీఏలు ఏడాదిలో రూ.63,182 కోట్ల నుంచి రూ.55,997 కోట్లకు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే స్థూల ఎన్‌పిఎ నిష్పత్తిలో 123 బేసిస్ పాయింట్లు తగ్గగా, అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 86 బేసిస్ పాయింట్లు తగ్గాయి. అదే సమయంలో మూడవ త్రైమాసికంలో నికర ఎన్‌పిఎలు 2.25 శాతంగా ఉన్నాయి. ఈ సంఖ్య ఏడాది క్రితం 2.39 శాతం కాగా ,సెప్టెంబర్ త్రైమాసికంలో 2.83 శాతంగా ఉంది. మరోవైపు గృహ రుణాలు 6.57 శాతం, వాహన రుణాలు 20.54 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Banking News: ఆ బ్యాంకు ఖాతాదారులకు షాక్‌.. వడ్డీ రేట్లు తగ్గింపు

PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!