ATM PIN Fraud: ఇలాంటి ఏటీఎం పిన్‌ నంబర్లను వాడుతున్నారా? మీ అకౌంట్‌ ఖాళీ.. జాగ్రత్త!

ATM PIN Fraud: మీ పుట్టిన తేదీని ఉపయోగించి, మీ మొబైల్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ఏటీఎం పిన్‌గా ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా మీరు ATM ఉపయోగిస్తున్నప్పుడు ఈ రకమైన పిన్‌ను ఉపయోగించకూడదు. మీరు..

ATM PIN Fraud: ఇలాంటి ఏటీఎం పిన్‌ నంబర్లను వాడుతున్నారా? మీ అకౌంట్‌ ఖాళీ.. జాగ్రత్త!

Updated on: Oct 19, 2025 | 9:40 PM

ATM PIN Fraud: మీరు మీ ATM పిన్‌ను ఒకే నంబర్‌తో వడుతున్నారా?. లేదా మీ పిన్‌ను గుర్తుంచుకోవడానికి మీ పుట్టిన తేదీని ఉపయోగించడం వంటి పిన్‌ను వాడుతున్నట్లయితటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సైబర్ దొంగలు మీ ATM పిన్‌ను హ్యాక్ చేయవచ్చు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, 1234 అనేది ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే పిన్. అలాగే 0000, 1111, 2222, 3333, 1212, 1122 వంటి పిన్‌లను సులభంగా హ్యాక్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: SIM Cards: సిమ్‌ కార్డులు వాడే వారికి అలర్ట్‌.. ఈ పొరపాటు చేస్తే రూ.2 లక్షల జరిమానా!

అంతే కాదు, మీ పుట్టిన తేదీని ఉపయోగించి, మీ మొబైల్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను పిన్‌గా ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ ద్వారా సులభంగా కనుగొనవచ్చు. అలాగే చాలా మంది ATM పిన్‌ల కోసం కారు నంబర్‌లను ఉపయోగిస్తారు. కానీ ఇది హ్యాకింగ్‌కు సులభతరం చేస్తుందంటున్నారు. సైబర్ దొంగలు ఖాతాలను హ్యాక్ చేయడానికి మొదట పుట్టిన తేదీ, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా 1234 1111 వంటి సింగిల్ డిజిట్ పిన్‌లను ఉపయోగిస్తారు. దీనివల్ల ఖాతాలను హ్యాక్ చేయడం సులభం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ కారణంగా మీరు ATM ఉపయోగిస్తున్నప్పుడు ఈ రకమైన పిన్‌ను ఉపయోగించకూడదు. మీరు మిశ్రమ నమూనా పిన్‌ను సృష్టించాలి. అలాగే మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి పిన్‌ను మార్చాలి. మీ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు.

ఇది కూడా చదవండిAadhaar: ఆధార్‌ విషయంలో సమస్యలు ఉన్నాయా? ఇదిగో హెల్ఫ్‌లైన్‌ నంబర్‌!

ఇది కూడా చదవండి: Diwali Offer: దీపావళి వేళ అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. సగం ధరకే Samsung Galaxy S24 FE ఫోన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి