Bank Employees: ఐదు రోజులే.. బ్యాంకు ఉద్యోగుల పట్టుదలకు కేంద్రం తలొగ్గనుందా..?
వారంలో ఐదు రోజులు పని షెడ్యూల్ చేయాలన్న బ్యాంకు ఉద్యోగుల పట్టుదలకు ప్రభుత్వం తలొగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఐదు రోజుల వారానికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిని అనుమతించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది..
వారంలో ఐదు రోజులు పని షెడ్యూల్ చేయాలన్న బ్యాంకు ఉద్యోగుల పట్టుదలకు ప్రభుత్వం తలొగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఐదు రోజుల వారానికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిని అనుమతించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. అందుకు అంగీకరించే అవకాశం దాదాపు ఖాయమని అంటున్నారు.
ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులకు 17 శాతం జీతం పెరిగే అవకాశం
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులకు శాతం. 17% జీతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. జీతం పెరిగితే 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో 12,449 కోట్ల భారం బ్యాంకులపై పడనుంది. అయితే వారంలో ఐదు రోజులు ఉన్నా పనిగంటల్లో ఎలాంటి తగ్గింపు లేదు. ప్రస్తుతం నెలలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇప్పుడు ప్రతి శనివారం ఆదివారం మాదిరిగానే సెలవు దినంగా ప్రకటించవచ్చు. అయితే, ఇతర రోజుల్లో అదనపు హాలిడే పీరియడ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఐదు పనిదినాల్లో ప్రతిరోజూ 50 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా, ఈ మధ్య కాలంలో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వారానికి కేవలం ఐదు రోజుల పాటు పనిదినాలు కల్పించి రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విధానం మన దేశంలోనే కాకుండా ముందుగా ఇతర దేశాలలో అమలులో ఉన్నాయి. వివిధ దేశాల్లో కంపెనీ ఉద్యోగులకు ఐదు రోజుల పాటు పని దినాలు ఉండగా, మరికొన్ని దేశాల్లో కేవలం వారంలో మూడు, నాలుగు రోజుల పాటు పనిదినాలు కల్పించి మిగతావి సెలవు దినాలుగా ప్రకటిస్తున్నాయి. మన దేశంలో వారంలో ఐదు రోజుల పాటు పనిదినాలు కల్పించి రెండు రోజుల సెలవు దినాలుగా ప్రకటించాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొన్ని కొన్ని కంపెనీలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి