Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IVR scam: ఆ ఒక్క బటన్ నొక్కితే బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్

ఆధునిక కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ప్రతి పనినీ చాలా సులువుగా చేసుకునే అవకాశం లభించింది. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల వివిధ మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాని పద్దతుల ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదును దొంగిలిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నకిలీ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) స్కామ్ తో పలువురి మోసం చేస్తున్నారు. ఆ స్కామ్ వివరాలు, దాని వల్ల నష్టపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

IVR scam:  ఆ ఒక్క బటన్ నొక్కితే బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్
ivr scam
Follow us
Srinu

|

Updated on: Feb 11, 2025 | 2:05 PM

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్)ను బ్యాంకులు, టెలికాం ప్రొవైడర్లు, కస్టమర్ సర్వీస్ హెల్ఫ్ లైన్లు ఉపయోగిస్తాయి. వాయిస్ కమాండెంట్, కీప్యాడ్ ఇన్ పుట్ లను ఉపయోగించి సేవలను అందజేస్తాయి. ఇంగ్లిష్ కోసం 1, బ్యాలెన్స్ విచారణ కోసం 2 నొక్కండి అని వినిపించేవి ఈ కోవలోకే వస్తాయి. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీని ద్వారా ప్రజలను మోసం చేసి లక్షలు దోచుకుంటున్నారు. ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక మహిళకు ఎస్ బీఐ బ్యాంక్ ఐవీఆర్ సిస్టమ్‌ను అనుకరించే ఆటోమేటెడ్ ఫోన్ కాల్‌ వచ్చింది. ఆమెకు ఎస్బీఐలో ఖాతా ఉండడంతో దానికి స్పందించింది. ఆమె ఖాతాను నుంచి రూ.2 లక్షలు బదిలీ అయ్యాయని, వాటిని ఆపాలంటే నిర్దిష్ట సూచనలు పాటించాలని దాని సాారాంశం. ఆ ఐవీఆర్ కాల్ ను నమ్మిన ఆ మహిళ అలాగే పలు కీలు నొక్కింది. వెంటనే రూ.2 లక్షలు డ్రా చేయబడ్డాయంటూ ఆమెకు సెల్ కు మెసేజ్ వచ్చింది. అనంతరం బాధితురాలు జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు వివరించగా, అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఇదే విధంగా శ్రీ విజయ పురం డాలీగంజ్‌కు చెందిన వ్యక్తి సుమారు రూ.80 వేలు పోగొట్టుకున్నాడు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి అతని మొబైల్ నెట్‌వర్క్ సస్పెండ్ చేయబడుతుందని హెచ్చరిస్తూ 2024 సెప్టెంబర్ లో అతడికి హెచ్చరిక వచ్చింది. ఆ కాల్ సమయంలో 9 నొక్కాలని అతనికి సూచించారు. అలాగే ముంబైలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆయన ఆధార్, ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సైబర్‌క్రైమ్ అధికారినంటూ మరో వ్యక్తి మాట్లాడారు. వారు చెప్పిన సూచనలను అనుసరించి బాధితుడు డబ్బును పోగొట్టుకున్నాడు. ఐవీఆర్ సిస్టమ్ మాదిరిగా స్కామర్లు నకిలీ వాటిని తయారు చేస్తున్నారు. వాటిలో బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, కార్డు నంబర్లను నమోదు చేసేలా ప్రజలను మోసం చేస్తారు. ఈ కాల్స్ చట్టబద్ధంగా కనిపించే నంబర్ నుంచి వచ్చినట్లు ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక సంస్థ, ప్రభుత్వ ఏజెన్సీ అధికారిక నంబర్‌తో కూడా సరిపోతుంది. ఈ ఆటోమేటెడ్ వాయిస్ నిజమైన ఐవీఆర్ సిస్టమ్‌ మాదిరిగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

  • ఆటోమేటెడ్ కాల్స్ కు స్పందించి ఓటీపీలు, పిన్లు, కార్డు నంబర్ల వివరాలను వెల్లడించవద్దు.
  • స్పామ్ కాల్స్ ను తగ్గించడానికి డోంట్ నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) సేవల కోసం నమోదు చేసుకోండి.
  • ఒకవేళ పొరపాటున స్పందిస్తే ఫోన్ ను వెంటనే హ్యాంగ్ ఆఫ్ చేయండి. అధికారిక నంబర్ ను ఉపయోగించి మీ బ్యాంకుకు కాల్ చేయండి.
  • సైబర్ క్రైమ్ అధికారులకు, ట్రాయ్ డీఎన్డీ రిజిస్ట్రీకి జరిగిన స్కామ్‌ను తెలపండి.
  • మీ బ్యాంకింగ్ వివరాలు షేర్ చేస్తే.. వెంటనే మీ కార్డును బ్లాక్ చేయడానికి, లావాదేవీలను స్తంభింపజేయడానికి మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
  • సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్ లో ఫిర్యాదు చేయండి, లేదా సాయం కోసం 1930కి కాల్ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి