Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Tomatoes : ఫ్రీగా టమోటాలు.. ఫైర్ అయిన కస్టమర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రస్తుతం మార్కెట్లో టామోటాలు ధర ఆకాశన్నంటుతున్నాయి. కేజీ రూ. 100 వరకూ కూడా వెళ్తోంది. ఈ సమయంలో ఎవరైనా ఉచితంగా టమోటాలు ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? చెప్పండి.. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఉచితంగా టమోటాలు ఇచ్చిన వెబ్ సైట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దానికి ఏకంగా డార్క్ ప్యాటర్న్ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.

Free Tomatoes : ఫ్రీగా టమోటాలు.. ఫైర్ అయిన కస్టమర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Swiggy Instamart Free Tomatoes
Follow us
Madhu

|

Updated on: Oct 16, 2024 | 3:41 PM

ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ బాగా పెరిగింది. అధిక సంఖ్యలో ప్రజలు ఆయా ప్లాట్ ఫారంలను వినియోగిస్తున్నారు. కేవలం వస్తువుల కొనుగోలుకు మాత్రమే కాదు. ఆహారం, గాయకూరలు, నిత్యావసరాలు కూడా పలు ఆన్ లైన్ ప్లాట్ ఫారంలు డోర్ డెలివరీ ఇస్తున్నాయి. ముఖ్యంగా షాపింగ్ ట్రెండ్ బాగా పెరిగింది. అలాంటి ఓ ప్లాట్ ఫారంలో ఓ విచిత్రం చోటుచేసుకుంది.ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో తనకు ఉచితంగా టామోటాలు ఇస్తానన్నందుకు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్విగ్గీ ఇన్ స్టామార్ట్..

స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫారం గురించి వినే ఉంటారు. చాలా సిటీల్లో దీనిని విరివిగా వినియోగిస్తారు. బెంగళూరులోని ఓ వినియోగదారు స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో గుడ్లు కొనుగోలు చేద్దామని కార్ట్ లో పెట్టారు. అయితే దానికి ఓ అరకేజీ టమోటాలు కూడా యాడ్ అయ్యాయి. కానీ ఆ కస్టమర్ దానిని యాడ్ చేయలేదు. వాటిని తొలగించాలని ట్రై చేసినా వీలుపడలేదు. దాని ధర చూస్తే ఫ్రీ అని కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటివి మనం చూస్తే.. ఏదో ఆఫర్ అనుకొని బుక్ చేస్తాం. పైగా టమోటాల రేటు భారీగా ఉండటంతో దొరికిందే చాన్స్ అని తీసేసుకుంటాం. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా ఫ్రీ టమోటాలు ఇచ్చినందుకు విపరీతంగా ఫైర్ అయ్యారు. ఫ్రీగా ఎందుకు ఇస్తారు? పైగా తొలగించడానికి ఆప్షన్ కూడా లేకుండా ఎందుకు చేశారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్స్ లో పోస్టు వైరల్..

దీనిపై ఆ వ్యక్తి ఎక్స్ వేదికగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. బెంగళూరు మ్యాన్ అనే పేరుతో ఉన్న ఆ ఎక్స్ ఖాతాలో స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. దానిని డార్క్ ప్యాటర్న్ గా అభివర్ణించారు. అంటే టమోటాలు మనకు ఫ్రీగా ఎరచూపి.. మన నుంచి ఏదో సీక్రెట్ తీసేసుకుంటారని ఆయన భావన. టమోటాల ధర ప్రస్తుతం మండిపోతున్నాయి. అయినా ఫ్రీగా ఇస్తున్నారు.. తప్పు కాదు.. కానీ అవసరం లేని వారికి దానిని తొలగించే అవకాశం కూడా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిలో ఏదో మతలబు దాగి ఉందని, మన వ్యక్తిగత విషయాలు సీక్రెట్ గా సేకరిస్తారేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ మేరకు తను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కాగా నెటిజనులు కూడా బాగానే స్పందిస్తున్నారు. కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొంత మంది ఆయన అడిగిన దానిలో లాజిక్ ఉందని పేర్కొంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..