Mutual Funds: బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ గురించి తెలుసా? రిస్క్ లేకుండా లాభాలు పొందాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!
లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు పొందాలనుకునేవాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్ ఆధారంగానే పని చేస్తాయి. కాబట్టి వీటితో రిస్క్ ఉంటుందనుకుంటారు చాలామంది. అయితే వీటిలో కూడా తక్కువ రిస్క్ ఉండే ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం అనేది మంచి ఆప్షన్ గానే ఆర్థిక నిపుణులు పరిగణిస్తారు. అయితే కొన్ని సార్లు మార్కెట్లు బాగా డౌన్ అయినప్పుడు వీటిలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. కొన్నిసార్లు నష్టాల్లోకి కూడా వెళ్లొచ్చు. అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ లో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో 40 నుంచి 60 శాతం ఈక్విటీ.. అంటే స్టాక్స్ లో మరో 40 నుంచి 60 శాతం డెట్ ఫండ్స్.. అంటే గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్, సిల్వర్ వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల లాభాలు ఆర్జిస్తూనే సేఫ్ గా కూడా ఉండొచ్చు.
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అంటే..
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అంటే మీ డబ్బులో 60 శాతం గవర్నమెంట్ బాండ్స్ వంటి డెట్ సెక్యూరిటీస్ లో మరో 40 శాతం ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. తద్వారా ఈక్విటీలో ఒకవేళ నష్టాలు వచ్చినా డెట్ లో ఉన్న ఫండ్స్ సేఫ్ గా ఉంటాయి. అదే ఈక్విటీ మార్కెట్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంటే ఇక మీకు లాభాల పంటే.
రిస్క్ తక్కువ
సాధారణంగా ఈక్విటీ ఫండ్స్ లో ఏడాదికి కనీసం10 నుంచి 12 శాతం సగటు రిటర్న్స్ వచ్చేలా ఫండ్ మెనేజర్స్ టార్గెట్ పెట్టుకుంటారు. ఇవి 30 నుంచి 40 శాతం దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది మార్కెట్ మీద ఆధార పడి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ లో స్థిరంగా 8 నుంచి 9 శాతం రిటర్న్స్ వస్తాయి. వీటిలో ఎలాంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ లో పెట్టుబడి పెట్టే బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే సేఫ్ గా ఉంటూనే కాస్త ఎక్కువ లభాలు గడించొచ్చు.
జాగ్రత్తలు ముఖ్యం
బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్ లో మళ్లీ కొన్ని రకాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను బట్టి ఆయా ఫండ్స్ మారుతుంటాయి. ఏదేమైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేముందు ఆయా డాక్యుమెంట్స్ అన్నీ చదివి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీకు నమ్మకమున్న ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




