August Auto Sales: ఆగస్టు నెలలో వాహనాల అమ్మకాలు జోరు.. విక్రయ ఫలితాలు విడుదల
టొయోటా కిర్లోస్కర్ మోటార్ విడుదల ద్వారా దాని బలమైన నెలవారీ పనితీరును నమోదు చేసింది. ఆగస్ట్ 2023లో 22,910 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో పోల్చినట్లయితే సంస్థ ఏడాదికి 53 పర్సంటేజ్ వృద్ధిని నమోదు చేసినట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో కంపెనీ 14,959 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 20,970 యూనిట్లుగా ఉన్నాయి. ఆగస్టు 2023 నెలలో కంపెనీ 1,940 యూనిట్ల ఎగుమతులు చేసినట్లు నివేదించింది..
ఆగస్ట్ నెల విక్రయ ఫలితాలను విడుదల చేసేందుకు ఆటో పరిశ్రమ సన్నాహాలు చేసింది. సెగ్మెంట్‌లోని కొంతమంది ప్రముఖ కంపెనీల పనితీరు బాగా కనబర్చాయి.
మారుతీ సుజుకి
మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ఆగస్టు నెలలో మొత్తం 1,89,082 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. ఇది దాని అత్యధిక నెలవారీ విక్రయాల పరిమాణంగా తెలిపింది. నెలలో మొత్తం అమ్మకాలలో దేశీయంగా 1,58,678 యూనిట్లు, ఇతర ఒరిజినల్ పరికరాల తయారీదారులకు 5,790 యూనిట్ల అమ్మకాలు, 24,614 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి. ఈ నెల విక్రయాల గణాంకాలు మారుతి యుటిలిటీ వాహనాలైన బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎస్-క్రాస్, ఎక్స్‌ఎల్‌లకు బలమైన డిమాండ్‌ను సూచిస్తున్నాయి. దేశీయ కార్ల తయారీదారు SUV అమ్మకాలు ఆగస్టు 2022లో 26,932 వాహనాల నుంచి ఆగస్టు 2023 నాటికి 58,746 వాహనాలకు పెరిగాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్స్
టొయోటా కిర్లోస్కర్ మోటార్ విడుదల ద్వారా దాని బలమైన నెలవారీ పనితీరును నమోదు చేసింది. ఆగస్ట్ 2023లో 22,910 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో పోల్చినట్లయితే సంస్థ ఏడాదికి 53 పర్సంటేజ్ వృద్ధిని నమోదు చేసినట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో కంపెనీ 14,959 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 20,970 యూనిట్లుగా ఉన్నాయి. ఆగస్టు 2023 నెలలో కంపెనీ 1,940 యూనిట్ల ఎగుమతులు చేసినట్లు నివేదించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్
మహీంద్రా అండ్ మహీంద్రా ఒక విడుదలలో ఆగస్టు 2023కి కంపెనీ మొత్తం ఆటో అమ్మకాలు 70,350 వాహనాలుగా నమోదయ్యాయి. ఎగుమతులతో పాటు ఏడాదికి 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. యుటిలిటీ వెహికల్స్ విభాగంలో మహింద్రా దేశీయ విపణిలో 37,270 యూనిట్ల ఎస్‌యూవీల అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. ఎగుమతులతో సహా మొత్తం 38,164 యూనిట్లను నమోదు చేసింది. మహీంద్రా వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు 23,613 యూనిట్లుగా ఉన్నాయి.
బజాజ్ ఆటో
బజాజ్ ఆటో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఆగస్టులో 20 శాతం క్షీణించి 2.85 లక్షల యూనిట్లకు పడిపోయాయి. ఎందుకంటే దాని దేశీయ పంపకాలు భారీగా తగ్గాయి. అయితే ఆగస్టులో కంపెనీ ఎగుమతులు 2 శాతం పెరిగాయి. అయితే దేశీయ విక్రయాలు 20 శాతం క్షీణించి 2,56,755 యూనిట్ల నుంచి 2,05,100 యూనిట్లకు చేరగా, ఎగుమతులు 6 శాతం తగ్గుముఖం పట్టి, 1,44,840 యూనిట్ల నుంచి 1,36,548 యూనిట్లకు క్షీణించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా
హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) ఆగస్టులో 71,435 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఆగస్ట్ అమ్మకాలు ఇండియా మర్కెట్లో 53,830 యూనిట్లు ఉండగా, 17,605 యూనిట్లు ఎగుమతి అయినట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ కంపెనీ ఎస్‌యూవీ కార్లకు బలమైన డిమాండ్, హ్యుందాయ్ మొత్తం అమ్మకాలను పెంచడంలో వారి సహకారాన్ని హైలైట్ చేశారు. మా పోర్ట్‌ఫోలియోలో SUVలకు డిమాండ్ బలంగా ఉంది. ఇప్పటివరకు HMIL ద్వారా 65,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు అందాయి అని గార్గ్ చెప్పారు.
MG మోటార్
MG మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాల గణాంకాలు నెలలో 4,185 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో దాదాపు 10 శాతం వృద్ధి. పండుగ సీజన్‌లో ప్రస్తుత జోరుపై కార్ల తయారీ సంస్థ సన్నద్ధమవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి