AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు ముగుస్తోంది.. చివరి తేదీ ఎప్పుడంటే..

Free Aadhaar Card Update: ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడీఏఐ), ఆధార్‌లో నమోదు చేయబడిన సమాచారాన్ని అప్‌డేట్ చేయమని ఎప్పటికప్పుడు అడుగుతోంది. కోట్లాది మంది ఆధార్ వినియోగదారులలో ఆధార్ అప్‌డేట్‌ను ప్రోత్సహించడానికి యుఐడీఏఐ ఉచిత ఆధార్ ఆప్‌డేట్‌  సౌకర్యాన్ని ప్రారంభించింది.

Aadhaar Update: ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు ముగుస్తోంది.. చివరి తేదీ ఎప్పుడంటే..
Aadhaar
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2023 | 9:36 AM

Share

ఆధార్ కార్డు.. భారతీయులకు అత్యంత ముఖ్యమూన డాక్యూమెంట్. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడీఏఐ), ఆధార్‌లో నమోదు చేయబడిన సమాచారాన్ని అప్‌డేట్ చేయమని ఎప్పటికప్పుడు అడుగుతోంది. కోట్లాది మంది ఆధార్ వినియోగదారులలో ఆధార్ అప్‌డేట్‌ను ప్రోత్సహించడానికి యుఐడీఏఐ ఉచిత ఆధార్ ఆప్‌డేట్‌  సౌకర్యాన్ని ప్రారంభించింది. యుఐడీఏఐ జూన్ 14 వరకు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసే సదుపాయాన్ని అందిస్తోంది. ఆ తర్వాత 3 నెలల పాటు సెప్టెంబర్ 14, 2023 వరకు పొడిగించబడింది.

మీరు కూడా ఎటువంటి రుసుము లేకుండా ఆధార్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే.. మీకు చివరి అవకాశం ఉంది. వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. దీంతో మీరు ఫైన్ పడకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే మనలో చాలా మందికి ఆధార్‌ను ఎలా అప్‌డేట్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. అందు కోసం ముందుగా ఇలా చేయండి.

10 ఏళ్ల ఆధార్‌ను అప్‌డేట్ చేయండి

ఆధార్ జారీ చేసే సంస్థ అయిన యుఐడీఏఐ, ఆధార్ సృష్టించి 10 ఏళ్లు దాటిన ఆధార్ వినియోగదారులందరినీ అప్రమత్తం చేసింది. సంస్థ ప్రకారం, 10 సంవత్సరాలకు పైగా ఆధార్‌ను నవీకరించని వారు ఈ పనిని పూర్తి చేయాలి. ఇందులో అడ్రస్, మొబైల్ నంబర్ తదితర వివరాలను ఎలాంటి ఛార్జీ లేకుండా మార్చుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌డేట్ చేయండి

విశేషమేంటంటే, మీరు కూడా ఉచితంగా ఆధార్ అప్‌డేట్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే.. ఈ పనిని ఆన్‌లైన్‌లో చేయండి. ఆఫ్‌లైన్ ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. ఉచిత సౌకర్యాన్ని పొందడానికి, మై ఆధార్ పోర్టల్‌కి వెళ్లండి. ఈ పోర్టల్ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని పొందుతారు.

ఉచితంగా ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి-

  • దీని కోసం మీరు మై ఆధార్ పోర్టల్ లేదా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయండి.
  • మీరు చిరునామాను అప్‌డేట్ చేయాలనుకుంటే, అప్‌డేట్ అడ్రస్ ఎంపికను ఎంచుకోండి.
  • దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఓటీపీని నమోదు చేయడం ద్వారా ముందుకు వెళ్లండి.
  • దీని తర్వాత, మీరు మీ పత్రాలను అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత, ఆధార్‌లో నమోదు చేయబడిన ప్రస్తుత వివరాలు మీ ముందు కనిపిస్తాయి.
  • ఈ వివరాలను ధృవీకరించండి. నెక్ట్స్ పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీరు అడ్రస్ ప్రూఫ్ కోసం అడ్రస్ సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయాలి.
  • దీని తర్వాత మీ ఆధార్ అప్‌డేట్ చివరకు ఆమోదించబడుతుంది.
  • ఆధార్ అప్‌డేట్ ఆమోదించబడిన తర్వాత, మీ కోసం 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) రూపొందించబడుతుంది.
  • దీని ద్వారా మీరు ఆధార్ అప్‌డేట్‌లను ట్రాక్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Follow Us