Bank Holidays In August 2025: ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవు దినాలు..! పూర్తి లిస్ట్‌ ఇదే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, ప్రతి ఆదివారం, రెండవ, నాలుగవ శనివారాలు సెలవులు. అదనంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పండుగ సెలవులు కూడా ఉంటాయి. మీ బ్యాంకింగ్ పనులను ప్లాన్ చేసుకోవడానికి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.

Bank Holidays In August 2025: ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవు దినాలు..! పూర్తి లిస్ట్‌ ఇదే..
Bank Holiday

Updated on: Jul 17, 2025 | 1:31 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంకులతో ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్‌ ఉంది. ఎంత డిజిటల్‌ లావాదేవీలు జరుపుతున్నా.. బ్యాంక్‌లతో పని పడకుండా అయితే ఉండటం లేదు. అయితే బ్యాంక్‌లు పనిచేసే సమయాలే కాదు.. వారికి సెలవులు కూడా ఎక్కువే ఉంటాయి. మరి మరికొద్ది రోజుల్లో రాబోతున్న 2025లోని ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయి? ఏ ఏ రోజులు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 పూర్తి సంవత్సరానికి అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను ముందే ఏడాది ఆరంభంలోనే ప్రకటిస్తుంది. ప్రతి నెలల ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా స్పష్టంగా పేర్కొంటుంది. ఆర్బీఐ ప్రకారం ఆగస్టు నెల బ్యాంక్‌ సెలవులు ఇలా ఉన్నాయి.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగో శనివారం సెలవు దినాలు కాగా, పండుగలు, ప్రత్యేక దినాల సంబర్భంగా కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయి ఉంటాయి. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ కోసం ఈ లింక్ పై క్లిక్  చేయండి.

ఆగస్టు 2025 లో బ్యాంకు సెలవులు:

తేదీ రోజు సందర్భంగా

రాష్ట్ర మూసివేత

ఆగస్టు 03, 2025 ఆదివారం కేర్ పూజ త్రిపుర
08 ఆగస్టు, 2025 శుక్రవారం టెండోంగ్ ల్హో రమ్ ఫాట్ సిక్కిం, ఒడిశా
09 ఆగస్టు, 2025 శనివారం రక్షా బంధన్ ఛత్తీస్‌గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్
13 ఆగస్టు, 2025 బుధవారం దేశభక్తుల దినోత్సవం మణిపూర్
15 ఆగస్టు, 2025 శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్
15 ఆగస్టు, 2025 శుక్రవారం పార్సీ నూతన సంవత్సరం (షాహెన్‌షాహి) మహారాష్ట్ర
16 ఆగస్టు, 2025 శనివారం జన్మాష్టమి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర
16 ఆగస్టు, 2025 శనివారం పార్సీ నూతన సంవత్సరం గుజరాత్, మహారాష్ట్ర
19 ఆగస్టు, 2025 మంగళవారం రక్షా బంధన్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
26 ఆగస్టు, 2025 మంగళవారం శ్రీ కృష్ణ అష్టమి గుజరాత్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
26 ఆగస్టు, 2025 మంగళవారం హర్తాలిక తీజ్ ఛత్తీస్‌గఢ్, సిక్కిం
26 ఆగస్టు, 2025 మంగళవారం గణేష్ చతుర్థి కర్ణాటక, కేరళ
27 ఆగస్టు, 2025 బుధవారం గణేష్ చతుర్థి ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ
28 ఆగస్టు, 2025 గురువారం గణేష్ చతుర్థి గోవా, గుజరాత్
28 ఆగస్టు, 2025 గురువారం నువాఖై ఒడిశా, పంజాబ్, సిక్కిం