AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా..? ఇవి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది జాగ్రత్త..

మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా? పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఎవరూ చూడడం లేదని అనుకుంటే పొరపాటే. మీ పిన్ నంబర్ ఎవరికీ చెప్పకపోయినా మీ అకౌంట్ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. అవును.. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో రంగంలోకి దిగారు. ఈ టెక్నాలజీ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా..? ఇవి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది జాగ్రత్త..
Atm Thermal Scanning Scam
Krishna S
|

Updated on: Jun 20, 2026 | 2:38 PM

Share

ఈ డిజిటల్ యుగంలో క్యాష్ వాడకమే తగ్గిపోయింది. ఎక్కడ చూసి యూపీఐ పేమెంట్సే.. అత్యవసరం అయితేనే జనాలు ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కేటుగాళ్లు కూడా కొత్త దారుల్లో మోసాలకు తెరతీస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎం యూజర్లను వణికిస్తున్న సరికొత్త మోసం థర్మల్ స్కానింగ్ స్కామ్. మీరు ఏటీఎంలో పిన్ నంబర్ ఎంటర్ చేసి వెళ్లిన కొన్ని సెకన్లలోనే.. మీ పిన్ నంబర్ ఏంటో దొంగలు కనిపెట్టేస్తున్నారు. దీనికి వారు వాడుతున్న టెక్నాలజీ ఏంటీ అని అనుకుంటున్నారా..? థర్మల్ స్కానింగ్ టెక్నిక్.. దీన్ని గురించి చాలా మందికి తెలియదు.

ఏంటి ఈ థర్మల్ స్కానింగ్ టెక్నిక్?

మనం ఏటీఎం కీప్యాడ్‌పై పిన్ నంబర్ నొక్కినప్పుడు, మన వేళ్లలో ఉండే వేడి ఆ బటన్స్‌పై కొద్దిసేపటి వరకు అలాగే ఉంటుంది. దీనినే హీట్ పాటర్న్ అంటారు. సైబర్ నేరగాళ్లు ప్రత్యేకమైన థర్మల్ కెమెరాలు లేదా స్కానింగ్ పరికరాల సహాయంతో ఈ వేడి గుర్తులను గుర్తిస్తారు. ఏ బటన్‌ను కాసేపటి క్రితం నొక్కారో ఈ కెమెరాల ద్వారా వారికి తెలిసిపోతుంది. దీనివల్ల వారు మీ పిన్ నంబర్‌ను సులువుగా అంచనా వేయగలుగుతారు.

ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?

మీరు ఏటీఎంలో లావాదేవీ ముగించుకుని బయటకు రాగానే.. నిందితుడు వెంటనే లోపలికి వెళ్లి కీప్యాడ్‌ను థర్మల్ కెమెరాతో స్కాన్ చేస్తాడు. కెమెరాలో చూసినప్పుడు ఏ బటన్ ఎక్కువ వేడిగా కనిపిస్తుందో, అది చివరగా నొక్కిన బటన్ అని అర్థం. కొంచెం తక్కువ వేడి ఉన్న బటన్ అంతకంటే ముందు నొక్కినదిగా గుర్తిస్తారు. ఉదాహరణకు.. మీరు 3478 అనే నంబర్లు నొక్కితే, ఆ నాలుగు బటన్స్ వేడిగా కనిపిస్తాయి. ఆ నంబర్లను అటు ఇటు మార్చి చూసి మీ పిన్ నంబర్‌ను కేటుగాళ్లు ఈజీగా కనిపెట్టేస్తారు.

ప్లాస్టిక్ vs మెటల్ కీప్యాడ్: ఏది సురక్షితం?

ప్లాస్టిక్ కీప్యాడ్: వీటిపై వేళ్ల వేడి ఎక్కువ సమయం పాటు ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ కీప్యాడ్ ఉన్న ఏటీఎంలలో ఈ థర్మల్ స్కామింగ్ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది.

మెటల్ కీప్యాడ్: ఇవి వేడిని చాలా వేగంగా వ్యాప్తి చేసి, త్వరగా చల్లబడిపోతాయి. అందువల్ల మెటల్ కీప్యాడ్లు ఉన్న చోట థర్మల్ స్కానింగ్ ద్వారా సమాచారం సేకరించడం దొంగలకు చాలా కష్టం.

ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్

ఏటీఎంలో పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు, ఎవరూ చూడకుండా ఉండటానికే కాకుండా థర్మల్ కెమెరాల స్కానింగ్‌కు దొరకకుండా ఉండటానికి ఒక చేత్తో కీప్యాడ్‌ను పూర్తిగా కవర్ చేయండి. లావాదేవీ పూర్తయిన తర్వాత కీప్యాడ్‌పై ఉన్న మిగిలిన కొన్ని బటన్లను కూడా ఊరికే అలా తాకండి. దీనివల్ల అన్ని బటన్లపై వేడి సమానంగా వ్యాపించి, దొంగలు అసలు పిన్ నంబర్‌ను అంచనా వేయలేరు. రద్దీ లేని, ఒంటరిగా ఉన్న ఏటీఎంలను వాడేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. డబ్బులు డ్రా చేసిన వెంటనే బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్‌లను చెక్ చేసుకోండి. ఏదైనా తేడా వస్తే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.

Follow Us