ITR filing: దేశంలో ఇంతమంది కోటీశ్వరులా..? ఆదాయపు పన్నుశాఖ నివేదిక అసలు గుట్టు బట్టబయలు

దేశంలో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలామంది ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రతిభ చూపుతూ ముందుకు సాగుతున్నారు. తమ సంపాదనను అనేక రెట్లు పెంచుకుంటున్నారు. దేశంలో నెలకొన్న అనుకూల పరిస్థితులు, ప్రభుత్వం ప్రోత్సాహం, రాజకీయ సుస్థిరత తదితర అనేక విషయాాలు దీనికి కారణం.

ITR filing: దేశంలో ఇంతమంది కోటీశ్వరులా..? ఆదాయపు పన్నుశాఖ నివేదిక అసలు గుట్టు బట్టబయలు
Income Tax
Follow us

|

Updated on: Oct 25, 2024 | 3:35 PM

ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్)లో ఒక కోటి కన్నా ఎక్కువ పన్ను విధించే ఆదాయాన్ని చూపుతున్న వారిసంఖ్య గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనం. అలాంటి వారు 2013-14 అసెస్ మెంట్ ఇయలో లో 44, 078 మంది ఉండగా, 2023-24 నాటికి 23 లక్షలకు పెరగడం విశేషం. పరిమితికి మించిన ఆదాయం వస్తున్న వారందరూ ఆదాయపు పన్ను చెల్లించాలి. దీని కోసం ఆ ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం వివరాలను తెలుపుతూ ఐటీఆర్ దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను శాఖ ఆ వివరాలను పరిశీలించి ఎంత పన్ను కట్టాలో నిర్ధారణ చేస్తుంది. ఇలా ఐటీఆర్ సమర్పిస్తున్న వారిలో కోటి కన్నా ఎక్కువ ఆదాయం చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఐటీఆర్ లు అందజేసే వారి సంఖ్య కూడా 3.3 కోట్ల నుంచి 7.5 కోట్ల పెరగడం విశేషం. అలాగే కోటి నుంచి ఐదు కోట్ల విభాగంలో జీతం పొందుతున్న వ్యక్తుల సంఖ్య 53 శాతం ఉంది. ఇక ఆపై వ్యాపారవేత్తలు, నిపుణులు ఉంటున్నారు. వార్షిక పన్ను ఆదాయాన్ని రూ.500 కోట్లకు మంచి ఉన్నట్టు ఐటీఆర్ దాఖలు చేసిన వారిలో 23 మంది జీతం పొందడం లేదు. కానీ 100 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య ఉన్న 262 మందిలో 19 మంది మాత్రమే జీతం పొందుతున్నారు.

2013-14 అసెస్ మెంట్ ఇయర్ (ఏవై) లో ఒక వ్యక్తి మాత్రమే రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నట్టు ప్రకటించాడు. రూ.100 కోట్ల నుంచి 500 కోట్ల విభాగంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయితే 2022-23తో పోల్చితే గత ఏడాదిలో రూ.25 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని నివేదించేవారి సంఖ్య 1812 నుంచి 1789కి తగ్గింది. అలాగే వేతనాలు పొందేవారిలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ కేటగిరిలోని వారు 1,656 నుంచి 1,577కి తగ్గిపోయారు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏవై 2023లో రూ.4.5 లక్షల నుంచి 9.5 లక్షల విభాగంలో ఐటీఆర్ దాఖలు చేసిన వారు 52 శాతం పెరిగారు. ప్రతి నాలుగు ఐటీఆర్ లలో ఒకటి రూ.5.5 – 9.5 లక్షలు, ప్రతి ఐదింటిలో ఒకటి రూ. 2.5 – 3.5 లక్షల విభాగంలో ఉంటున్నాయి.

పరిమితికి మించి ఆదాయం పొందుతున్న వారందరూ ఐటీఆర్ సమర్పించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే కొందరు దీని పరిధిలోకి రానప్పటికీ ప్రత్యేక సందర్బాల్లో ఐటీఆర్ దాఖలు చేయాలి. విదేశాలలో ఇళ్లు, అక్కడి కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారు.. వాటిపై వచ్చే ఆదాయాన్ని తెలుపుతూ ఐటీఆర్ ఫైల్ చేయాలి. విదేశీ ప్రయాణానికి, వేరొకరు విదేశాలకు వెళ్లడానికి ఒకేసారి రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ ఖర్చు చేసిన వారు దాఖలు చేయాలి. ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లిస్తే కూడా ఐటీఆర్ అందజేయాలి. మూలధన లాభాలపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేవారు. టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.25 వేలు ఉన్నవారు, కరెంటు ఖాతాలో రూ.కోటి కన్నా ఎక్కువ డిపాజిట్ అయిన వారు సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..