Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?

|

Jan 15, 2022 | 8:16 AM

Mutual Fund: ఇటీవల వచ్చిన శుభవార్తతో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసినవారు చాలా సంతోషంగా ఉన్నారు. డిసెంబర్ 2021లో ఈక్విటీ ఆధారిత

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?
Rupee
Follow us on

Mutual Fund: ఇటీవల వచ్చిన శుభవార్తతో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసినవారు చాలా సంతోషంగా ఉన్నారు. డిసెంబర్ 2021లో ఈక్విటీ ఆధారిత పథకాల్లో రూ. 25,076 కోట్ల నికర పెట్టుబడి వచ్చింది. నవంబర్ 2021లో ఇందులో రూ.11,614 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఒక్క నెలలోనే అందులో 116% ఆకట్టుకునే వృద్ధి కనిపించింది. AMFI (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ, 2021 సంవత్సరంలో SIP నుంచి పెట్టుబడుల సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 2021లో SIP ద్వారా పెట్టుబడి రూ.11,305.34 కోట్లకు పెరిగింది. నవంబర్ 2021లో SIP ద్వారా రూ.11,004.94 కోట్లు పెట్టుబడి పెట్టారు.

ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఇప్పుడు టాప్-అప్‌లు అని పిలువబడే బూస్టర్ ఎంపికలను ఎంచుకోవడాన్ని ఆలోచించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. SIP బూస్టర్ అనేది పెట్టుబడిదారులకు నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తం పెంచుకునే అవకాశాన్ని కల్పించే సదుపాయం. ఇది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. SIP బూస్టర్ సదుపాయం ప్రారంభంలోనే దరఖాస్తు చేసుకోవచ్చని గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఇప్పటికే SIPని నడుపుతున్నట్లయితే బూస్టర్ సౌకర్యం కోసం వారు ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికోసం పాత SIPని రద్దు చేసి కొత్తదానిని ఎంచుకోవడమే ఉన్న ఏకైక మార్గం.

బూస్టర్ డోస్ ఎలా పని చేస్తుంది?

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం.. సురేంద్ర తన రిటైర్మెంట్‌ పొదుపును పెంచుకోవడానికి ప్రతి నెలా SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడనుకుందాం. అతను తదుపరి 20 సంవత్సరాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా 20 వేల రూపాయలను SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తాడు. ఇందులో తమకు కనీసం 11 శాతం రాబడి వస్తుందని ఆశిస్తున్నాడు. ఈ విధంగా మొత్తం రూ.48 లక్షల పెట్టుబడిపై రూ.1.75 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ ఉంటుందని సురేంద్ర భావిస్తున్నాడు.

ఇప్పుడు సురేంద్ర తన నెలవారీ SIPని ప్రతి సంవత్సరం 10 శాతం పెంచాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సురేంద్రకు మొత్తం రూ.93.60 లక్షల పెట్టుబడితో దాదాపు రూ.3.20 కోట్ల ఫండ్ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని కేవలం 10 శాతం పెంచడం ద్వారా సురేంద్ర రూ. 1.46 కోట్ల అదనపు నిధిని పొందుతాడు. 20 వేల SIPలో 10 శాతం బూస్టర్ అంటే ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయలు పెంచాల్సి ఉంటుంది.

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. 30 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు..!

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..