Ampere Primus: రూ.999కే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. ధర, ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..

| Edited By: Anil kumar poka

Jan 25, 2023 | 6:49 PM

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇటీవలే ‘ హర్ గల్లీ ఎలక్ట్రిక్’ నినాదంతో ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ ఆంపియర్ అధికారిక వెబ్ సైట్ లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ.999 మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Ampere Primus: రూ.999కే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. ధర, ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..
Primus
Follow us on

ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న ఈవీ ఫీవర్ ను కంటిన్యూ చేస్తూ మరో కొత్త కంపెనీ తన స్కూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇటీవలే ‘ హర్ గల్లీ ఎలక్ట్రిక్’ నినాదంతో ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ ఆంపియర్ అధికారిక వెబ్ సైట్ లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ.999 మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ బుకింగ్ సొమ్ము కూడా పూర్తిగా వాపసు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి ఈ స్కూటర్ రోడ్లపైకి రానుంది. అలాగే ఈ స్కూటర్ రూ.95,000 ధరకు అందుబాటులో ఉంటుంది. అలాగే 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఏఆర్ఏఐ ప్రామాణిక పరీక్ష వద్ద ఈ బైక్ ఓ సారి చార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల పరిధి కలిగి ఉంది.

ఆంపియర్ ప్రైమస్ ఫీచర్లు

ఆంపియర్ ప్రైమస్ డిజైన్ మామూలు పెట్రో వెర్షన్ స్కూటర్లలో లా ఉంటుంది. ఎర్గోనామిక్ సీటింగ్, పొడవాటి లెగ్ రూమ్, అలాగే 22 లీటర్ల బూట్ స్పేస్ తో రైడర్ కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 15 ఆంప్స్ చార్జర్ తో అయితే 4.5 గంటల్లో, 25 ఆంప్స్ చార్జర్ తో అయితే 2.5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అలాగే కేవలం 5 సెకన్లలో 40 కిలో మీటర్ల పరిధిని అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 150 కిలోల బరువును మోసేలా గంటకు 77 కిలో మీటర్ల స్పీడ్ తో వెళ్తుందని పేర్కొంటున్నాయి. అలాగే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటుగా 12 అంగుళాల వీల్ టెలీస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది. బ్లూ టూత్ కనెక్టవిటీ, నావిగేషన్ తో పాటు మూడు రైడ్ లు మోడ్ లు ఉంటాయి. అలాగే ఇది ఎల్ సీడీ ఇన్సుస్ట్రుమెంట్ కన్సోల్ తో వస్తుంది. అలాగే ఇందులో ఉండే రివర్స్ మోడ్ వల్ల వెనక వైపు బరువు ఉన్నా రివర్స్ చేసేటప్పడు సౌకర్యంగా ఉంటుంది. ఈ స్కూటర్ బేసిక్ ఫీచర్లతో వచ్చినా యాంటీ థెఫ్ట్, లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ స్కూటర్ ఇతర ఈవీ స్కూటర్ల పోటీనిచ్చేలా లేదని మార్కెట్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ స్కూటర్ రేట్ లోనే వేరే స్కూటర్ లు వస్తున్నాయి. దీంతో వాటి నుంచి చాలా కఠిన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం