Amazon Prime Day 2022 Sale: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు ఎన్నో ఆఫర్లను తీసుకువస్తుంటాయి. తాజాగా అమెజాన్ గొప్ప ఆఫర్‌తో ప్రజల ముందుకు రానుంది. పండగ సీజన్‌లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. ఇందులో తక్కువ ధరల్లో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక తాజాగా అమెజాన్ కూడా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం ప్రత్యేకంగా ప్రారంభమవుతుంది. జూలై 23, జూలై 24 తేదీల్లో అమెజాన్ అతిపెద్ద వార్షిక విక్రయం కొనసాగించనుంది. ఈ 6వ ప్రైమ్ డే సేల్‌లో, అమెజాన్ సేల్ సందర్భంగా, ప్రైమ్ సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులపై ఉత్తమమైన డీల్‌లను పొందుతారు. స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీ లేదా గృహోపకరణాన్ని కొనుగోలు చేయాలనుకున్నా, మీరు ప్రతి కేటగిరీ ఉత్పత్తులపై గొప్ప ఆఫర్‌లు, డీల్‌లను పొందుతారు. జూలై 22 అర్ధరాత్రి అంటే జూలై 23 అర్ధరాత్రి నుండి జూలై 24 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది.
Amazon సేల్ బ్యాంక్ ఆఫర్‌లు:
సేల్ సమయంలో షాపింగ్ చేసేటప్పుడు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డ్ లేదా EMIని ఉపయోగిస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం రాయితీ పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు రూ.20 వేల వరకు వస్తువుల తగ్గింపు, ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ పొందుతారు. వన్‌ప్లస్ 9 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.15వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.37,999 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే OnePlus 10 Pro 5G, రూ. 4,000 వరకు వోచర్‌లలో, రూ. 7,000 వరకు ఎక్ఛేంజ్‌తో అందుబాటులో ఉంటుంది. OnePlus 10R రూ. 34,999కు అందుబాటులో ఉంది.
Redmi Note 10 సిరీస్ ప్రారంభ ధర రూ.10,999. Redmi Note 10T 5G, Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max, Redmi Note 10S వంటి ఇతర పరికరాలపై కూడా తగ్గింపు ఉంటుందని సంస్థ తెలిపింది. Xiaomi 11 Lite ధర రూ.23,999 కాగా, Xiaomi 11T Pro ధర రూ.35,999. Xiaomi 12 Proపై కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఇది రూ. 56,999కి అందుబాటులో ఉంటుంది. అదనంగా, 12 ప్రోపై రూ.6,000 తగ్గింపు ఉంటుందని అమెజాన్ తెలిపింది.
Samsung Galaxy S21 FEపై 30% వరకు తగ్గింపు, గెలాక్సీ M52 5Gపై రూ. 15,000 తగ్గింపు ఉంటుంది. Amazon Samsung Galaxy M53 5G, Samsung Galaxy M33 5G పై రూ. 8,000 వరకు తగ్గింపును అందిస్తుంది. Samsung M32లో కస్టమర్లు రూ. 5,000 కూడా ఆదా చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్‌లపై కూడా భారీ ఆఫర్లను ఈ డీల్‌లో సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఇక జూలై 23, 24 తేదీలలో సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు Wow డీల్స్ కూడా ఉంటాయి. 40 శాతం వరకు తగ్గింపు మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లపై 75% వరకు తగ్గింపు, టీవీలు, ఇతర ఉపకరణాలపై 50% తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ కావాలంటే.. మీరు రూ. 1499 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక నెల ప్లాన్ కోసం మీరు రూ. 179 ఉంటుంది. మీరు 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే, కంపెనీ సభ్యత్వంపై పూర్తి 50% తగ్గింపును ఇస్తుంది. ఈ ఆఫర్లలో భాగంగా చాలా వస్తువులు తక్కువ ధరల్లో పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి