AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Offer: చిన్న వ్యాపారులకు పెద్ద ఆఫర్‌ ఇస్తున్న అమెజాన్.. అదేంటో తెలుసా..?

Amazon Small Businesses చిన్న వ్యాపారులకు అమెజాన్ బిజినెస్ ఆఫర్ అందిస్తోంది. ఇంటి నుంచి పని చేస్తూ తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అమెజాన్ చిన్న వ్యాపారులకు తోడ్పాటును అందిస్తోంది. ఇలాంటి వారి కోసం అమెజాన్ ఒక పెద్ద ఆఫర్ తో..

Amazon Offer: చిన్న వ్యాపారులకు పెద్ద ఆఫర్‌ ఇస్తున్న అమెజాన్.. అదేంటో తెలుసా..?
Amazon
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jan 27, 2026 | 11:59 AM

Share

Amazon Small Businesses: మీరు సొంతంగా వస్తువులను ఉత్పత్తి చేసుకుని స్థానికంగా ఉన్న వినియోగదారులకు మీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారా? లేదా సొంతంగా ఈ–కామర్స్ విధానంలో వస్తువులు, సేవలను కొనుగోలు చేయటం అమ్మకాలు జరపటం వంటి కార్యకలాపాలు చేస్తుంటారా ? ఇలాంటి వారి కోసం అమెజాన్ ఒక పెద్ద ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఈ కామర్స్ బిసినెస్ లోని ఇండిపెండెంట్ విక్రేతలకు సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలాంటి కోడింగ్ పరిజ్ఞానం లేక పోయినా సొంతంగా ఎవరికి వారు స్వంత వెబ్‌సైట్లు ఉచితంగా తయారు చేసుకునే విలు కల్పించింది.

ఇందుకోసం ‘స్మార్ట్‌బిజ్’ అనే టూల్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీని ద్వారా వస్తు, సేవల విక్రేతలు తమ తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించుకోవచ్చు. కరోనా తరువాత చాలా మంది ఇంటి నుంచి పని చేయటం ప్రారంభించారు. చేతి వృత్తి కళాకారులు పలు రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. పెయింటింగ్స్ నుంచి ఆహారపదార్ధాల వరకు చాలా మంది స్థానిక బ్రాండ్స్‌తో పరిమితమైన ప్రాంతానికే తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

ఇపుడు ఇలాంటి వారు తమ పరిధిని విస్తరించటానికి ముఖ్యంగా స్టార్ట్ అప్‌తో ముందుకు వచ్చే వారికి మేలు జరిగే అవకాసం ఉందని మేకేట్ వర్గాలు భావిస్తున్నాయి. ఏం ఎస్ ఏం ఈ లతో పాటు చిన్న చిన్న వ్యాపారులు డైరెక్ట్–టు–కస్టమర్ (D2C) మోడల్‌లోకి ప్రవేశించే అవకాశం కలుగుతుంది. ఇది మంచి వెసులు బాటుగా ఉంటుంది. వెబ్‌సైట్ల హోస్టింగ్, పేమెంట్లు , వస్తువుల ఆర్డర్స్ నిర్వహణతో పాటు కీలకమైన లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుంతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి