
యూట్యూబ్ కూడా తన యూజర్లకు కొత్త ఫీచర్లు అందజేస్తూ మరిన్ని మెరుగైన సేవలు అందిస్తోంది. దీనిలో భాగంగా ప్రీమియం సబ్ స్కైబర్లకు కొన్ని కొత్త ఫీచర్లను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా యూట్యూబ్ ను యూజర్లలందరూ ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ఆసక్తి గల వారి కోసం నెల, మూడు నెలలు, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం సబ్ స్కైబర్లకు కొన్ని ప్రయోగాత్మక ఫీచర్లను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించింది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూట్యూబ్ ప్రీమియం సబ్ స్కైబర్లు ఇప్పుడు మద్దతు ఉన్న మ్యూజిక్ వీడియోలలో 256 కేబీపీఎస్ వరకూ అధిక నాణ్యత కలిగిన ఆడియోను ఆస్వాదించవచ్చు. యూట్యూబ్ లో నేరుగా సంగీతాన్ని ప్రసారం చేయడానికి ఇష్టపడే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా ఆడియోను వినే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ప్లే బ్లాక్ స్పీడ్ ఎంపికలను క్రమంగా విస్తరించుకుంటూ పోతోంది. ఈ ప్లాట్ ఫాం ప్రస్తుతం 2 ఎక్స్ వరకూ వేగానికి మద్దతు ఇస్తోంది. ఇక నుంచి దాన్ని 4 ఎక్స్ వరకూ పెంచనున్నారు. అలాగే వెబ్ లో అందుబాటులో ఉన్న జంప్ ఏ హెడ్ ఫీచర్ ద్వారా వీడియోలోని ముఖ్య భాాగాలను నేరుగా వీక్షించడానికి వీలు కలుగుతుంది. యాక్టివేషన్ పేజీని సందర్శించిన యూట్యూబ్ ప్రీమియం సబ్ స్కైబర్లు ఈ ఫీచర్లను పొందవచ్చు. అయితే ఇవి పరిమిత సమయం వరకూ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి