Google: ఆగ్రహావేశాలకు లోనైన టెక్కీలు.. యూఎస్ గూగుల్ క్యాంపస్‌లలో నిరసన వ్యక్తం..
గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థ. ఈమధ్య కాలంలో గూగుల్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇదంతా నిన్న మొన్నటి వరకూ నడిచిన కథ. కంపెనీలు ఉద్యోగులపై జులం జులిపిస్తే ఎలా ఉంటుందో అందరూ చూశారు. అయితే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు నిరసన చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు సిబ్బంది. దీనికి కారణం లేకపోలేదు. కోవిడ్ తరువాత టెక్ కంపెనీల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థ. ఈమధ్య కాలంలో గూగుల్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇదంతా నిన్న మొన్నటి వరకూ నడిచిన కథ. కంపెనీలు ఉద్యోగులపై జులం జులిపిస్తే ఎలా ఉంటుందో అందరూ చూశారు. అయితే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు నిరసన చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు సిబ్బంది. దీనికి కారణం లేకపోలేదు. కోవిడ్ తరువాత టెక్ కంపెనీల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాజెక్టులు లేవు, సరైన సమయానికి ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. దీంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది గూగుల్ సంస్థ. దీంతో ఆగ్రహానికి వ్యక్తం అయ్యారు సంస్థలో పనిచేసే ఉద్యోగులు. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్‌ల్లో సుమారు 15,000 మందిని తొలగించింది.
ఈ తొలగింపులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18న యునైటెడ్ స్టేట్స్‌లోని ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. తొలగింపులను సమర్థించుకోవడానికి కంపెనీ చెబుతున్న కారణాలను బోగస్‌గా పేర్కొంటూ వాటిని సవాలు చేయడం ఈ నిరసనల లక్ష్యం అని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. అసంతృప్త ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్.. గత సంవత్సరంలో తొలగింపుల వల్ల దాదాపు 15,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఇదే జనవరి 18న యూఎస్ అంతటా ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసనలు చేపట్టేందుకు యూనియన్‌ను ప్రేరేపించింది. లేఆఫ్‌ల కారణంగా కొంతమంది జాబ్స్ పోవడమే కాకుండా ఉన్న ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఈ విషయాన్ని సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కమ్యూనికేషన్‌కు నాయకత్వం వహించే స్టీఫెన్ మెక్‌ముర్ట్రీ వ్యక్తపరిచారు. లేఆఫ్‌లు ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడమే కాకుండా దీర్ఘకాలం ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ఈ విమర్శలకు గూగుల్ స్పందించింది. “రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని బాధ్యతాయుతంగా పెట్టుబడి పెట్టడమే తమ వద్ద ఉన్న అతిపెద్ద ప్రాధాన్యతగా పేర్కొంది. సంస్థాగత మార్పుల్లో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తమ సంస్థ లోపల, బయట ఉద్యోగాలు పొందేందుకు బాధిత ఉద్యోగులకు సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు” గూగుల్ స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లు ఎంప్లాయిస్ను తొలగించిన టెక్ దిగ్గజం.. ఇప్పుడు చిక్కుల్లో పడనుంది. ఇలాంటి వాతావరణం రానున్న రోజుల్లో కంపెనీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








