- Telugu News Photo Gallery Business photos List of Finance ministers who presented highest Budget in india
Budget: అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది వీరే.. రికార్డ్ ఎవరి పేరుపై ఉందంటే..
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ప్రవేశపడుతోన్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌పై అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దేశంలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు, ఆ రికార్డు ఎవరి పేరుపై ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 22, 2024 | 6:07 PM

ఇప్పటి వరకు అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉంది. మొరార్జీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1958 నుంచి 1963 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇందులో రెండుసార్లు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మొరార్జీ దేశాయ్ తర్వాత పి. చిదంబరం అత్యధికంగా 9 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలిచారు. 1996 నుంచి 1997 వరకు తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1997 నుంచి 1998 వరకు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అనంతరం మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో యూపీఏ1, యూపీఏ2లో ఆర్థికమంత్రిగా సేవలందించారు.

ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి సీడీ దేశ్ ముఖ్ 7సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతీయ తొలి గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈయన మొత్తం ఏడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు.

యశ్వంత్ రావ్ చౌహన్ సైతం 7 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన చౌహన్ ఏడు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ వరుసగా ఆరవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2019 నుంచి ఆమె వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రుల్లో ఇందరి గాంధీ తొలి వ్యక్తి కాగా, నిర్మాలా సీతారమన్ రెండో వారు.




