IRFC Stock: ఆల్ టైం గరిష్టానికి రైల్వే స్టాక్.. ఏకంగా 600శాతం గ్రోత్‌తో సెన్సేషన్.. కారణమిదే..
షేర్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. ఎప్పుడూ ఏ షేర్ ఏ విధంగా పుంజుకుంటుందో.. ఏ షేర్ పతనమవుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఈ క్రమంలో గత 52 వారాలుగా పతనావస్థలో ఉన్న ఓ షేర్ పుంజుకొని అమాంతం ఆల్ టైం హైకి వెళ్లి కూర్చుంది. ఎంత రేంజ్ లో లాభపడిందో తెలుసా అక్షరాల 600శాతం ఎగబాకింది. దీంతో దానిలో పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. ఇంతకీ ఎంటా షేర్? తెలుసుకుందాం రండి..

షేర్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. ఎప్పుడూ ఏ షేర్ ఏ విధంగా పుంజుకుంటుందో.. ఏ షేర్ పతనమవుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఈ క్రమంలో గత 52 వారాలుగా పతనావస్థలో ఉన్న ఓ షేర్ పుంజుకొని అమాంతం ఆల్ టైం హైకి వెళ్లి కూర్చుంది. ఎంత రేంజ్ లో లాభపడిందో తెలుసా అక్షరాల 600శాతం ఎగబాకింది. దీంతో దానిలో పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. ఇంతకీ ఎంటా షేర్? తెలుసుకుందాం రండి..
ఐఆర్ఎఫ్సీ షేర్ షంషేర్..
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) షేర్లు ఆల్ టైం గరిష్టాన్ని చేరుకున్నాయి. దాని షేర్ ధరలో 10 శాతం ర్యాలీ మద్దతు ఉంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో ఐఆర్ఎఫ్సీ షేర్లు 8.71 శాతం లాభంతో రూ.174.32 వద్ద ట్రేడవుతున్నాయి. రైల్వే పీఎస్‌యూ స్టాక్‌లకు బలమైన డిమాండ్‌తో ఐఆర్‌ఎఫ్‌సీ షేర్లు గత కొన్ని సెషన్‌లుగా డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నాయి.
పది నెలల్లో 600శాతం..
ఈ ఐఆర్ఎఫ్సీ స్టాక్ కేవలం 10 నెలల్లోనే 600 శాతం ఎగబాకింది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుతం అత్యంత విలువైన రైల్వే పీఎస్యూగా మారింది. మార్చి 28, 2023న షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.25.45 నుంచి దాదాపు 600 శాతం పెరిగింది. అంతే కాక, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, బీపీసీఎల్, టాటా స్టీల్, సిప్లా వంటి నిఫ్టీ50 హెవీవెయిట్‌ల కంటే కూడా ఇది మరింత విలువైనదిగా మారింది. ఈ స్టాక్ కేవలం వారంలో 53 శాతం, ఒక నెలలో 75 శాతానికి పైగా పెరిగింది. 2023లో 200 శాతానికి పైగా ర్యాలీ చేసిన మల్టీబ్యాగర్ స్టాక్, బెంచ్‌మార్క్ సూచీల వలె ఊపందుకుని ముందుకుసాగుతోంది. ఎక్కడా నష్టాన్ని ఎదుర్కోలేదు.
ఈ కలల పరుగు కొనసాగుతుందా?
రాబోయే మధ్యంతర బడ్జెట్ 2024-25లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో విశ్లేషకులు స్టాక్ పై ఆశాజనకంగా ఉన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో, రైల్వేలకు మూలధన వ్యయం రూ.2.40 లక్షల కోట్లకు భారీ ప్రోత్సాహం లభించింది. మౌలిక సదుపాయాల కల్పనపై పాలక ప్రభుత్వం దృష్టి సారించినందున, రైల్వేలు బలమైన కాపెక్స్ బూస్ట్ పొందవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక రైల్వే పీఎస్‌యూ స్టాక్‌లైన ఐఆర్‌ఎఫ్‌సీ, ఆర్‌వీఎన్‌ఎల్, రైల్‌టెల్ కార్పొరేషన్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఐఆర్‌సీటీసీ వంటి స్టాక్స్ కూడా డ్రీమ్ రన్‌లో ఉండటానికి ఇది ఒక ప్రధాన కారణం.
కేవలం రైల్వే పీఎస్‌యూలే కాక, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న మధ్యంతర బడ్జెట్‌కు ముందు డిఫెన్స్ పీఎస్‌యూలు కూడా ఇదే విధమైన లాభాలను సాధిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మేకిన్ ఇండియా నినాదం..
ఇది ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్, అయితే పాలక ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందనే అంచనాల కారణంగా చివరి బడ్జెట్‌పై ఆసక్తిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించడంతో పాటు మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిపై ఫోకస్ పెడుతూ.. అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ప్రభుత్వ విధానాల కొనసాగింపును నిపుణులు కోరుతున్నారు. ఈక్రమంలోనే రైల్వేలు, రక్షణకు కేటాయింపులు చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతేకాక రైల్వే పీఎస్‌యూ స్టాక్స్‌లో ప్రస్తుత ఊపును బట్టి, మధ్యంతర బడ్జెట్ ప్రకటన వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు .
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








