- Telugu News Photo Gallery Technology photos Google introduce new searching feature circle to search and lens
Google: ఏఐలో దూకుడు పెంచిన గూగుల్.. ఇమేజ్ సెర్చ్‌లో సరికొత్త విప్లవం
ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దూసుకుపోతున్న గూగుల్ ఇమేజ్ సెర్చింగ్ సరికొత్త విప్లవానికి తెర తీసింది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఏంటీ ఫీచర్, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 01, 2024 | 7:00 PM

ఆన్‌లైన్‌లో సెర్చింగ్‌కు పెట్టింది పేరు గూగుల్. గూగుల్ సెర్చ్‌లో ఏ రకమైన సమాచారాన్ని అయినా ఇట్టే తెలుసుకోవచ్చు. అయితే ఈ సెర్చ్ ఆప్షన్‌లో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది గూగుల్.

సెర్చింగ్ ఆప్షన్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇన్ఫర్మేషన్ సెర్చింగ్‌ను మరింత సులభతం చేసేందుకు గూగుల్ తన ప్రీమియం డివైజ్‌లలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే రెండు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

‘సర్కిల్ టు సెర్చ్’, ‘లెన్స్’ పేరుతో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో స్క్రీన్‌పై కనిపించే ఫొటో లేదా వీడియోలో మీకు కావాల్సిన ఫొటోపై సర్కిల్, హైలెట్, స్క్రిబిల్ చేయడం ద్వారా ఆ ఫొటోకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు.

తాజాగా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-24 సిరీస్ ఫోన్‌లో ఫీచర్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో సహా ఇతర ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది.

ఇక ‘లెన్స్’ ఫీచర్ విషయానికొస్తే.. ఫోన్ కెమెరాలో ఏదైనా వస్తువును లేదా ప్రదేశాన్ని కవర్ చేస్తూ దానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్ననైనా అడిగి సమాచారాన్ని పొందవచ్చు. ఫొటోలు లేదా స్క్రీన్‌షాట్లను అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా వాటి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.




