- Telugu News Photo Gallery Technology photos Instagram introduces 'Nighttime Nudge' Feature To Reduce Screen Time
Instagram: అర్థరాత్రి వరకు ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారా.? ఇకపై మీ ఆటలు సాగవు
సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయంలేదు. ముఖ్యంగా యువత, టీనేజర్స్ ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చే కొంగొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను ఇన్‌స్టా పరిచయం చేసింది. ఇంతకీ ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే..
Updated on: Jan 20, 2024 | 3:42 PM

ఓవైపు కోట్లాది మంది యూజర్లను సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు యూజర్ల జాగ్రత్త గురించి కూడా ఆలోచిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్స్‌కు తమ వయసుకు తగ్గ స్టోరీలు, రీల్స్‌తో పాటు ఇతర కంటెంట్‌ను మాత్రమే అందించేలా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇక గంటల తరబడి ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపే వారికి చెక్‌పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ ఈ నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ నడ్జ్ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు.

ఈ ఫీచర్ సహాయంతో అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపిన వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది. మీరు పరిమితికి మించి ఎక్కువగా ఇన్‌స్టాలో గడిపారు. యాప్‌ను క్లోజ్ చేయండి అని హెచ్చరిక చేస్తూ అలర్ట్ వస్తుంది.

దీంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడదు అనేది ఇన్‌స్టాగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్స్, చిన్నారులు గడుపుతోన్న సమయం పెరుగుతోంది. దీంతో ఇది నిద్రపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్ 'నైట్ టైమ్ నడ్జ్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో టీనేజర్స్ అర్ధరాత్రి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం రీల్స్ లేదా డైరెక్ట్ మెసేజ్‌ల వంటివి ఏవీ ఓపెన్ చేసినా వెంటనే అలర్ట్ వస్తుంది.




