ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త తైమాసికం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై కొత్త నిబంధలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ అమలులో ఉన్న వాటికి బదులు కొత్త మార్గదర్శకాలను బ్యాంకులు అమలు చేయనున్నాయి. బ్యాంకులు అందించే వివిధ రకాల కార్డులతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వివిధ రకాల చార్జీలు అమలువుతాయి. అక్టోబర్ ఒకటి నుంచి వాటిలో అనేక మార్పులు రానున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ఆమోదించిన పలు అంశాలు కూడా అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన మార్పులపై అందరికీ అవగాహన అవసరం. కొత్త త్రైమాసికం అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది, ఈ సందర్భంగా మీ పెట్టుబడులు తదితర వాటికి సంబంధించి కొన్ని మార్పులు జరుగుతాయి. వీటిలో సేవింగ్ ఖాతా చార్జీలు, డెబిట్ ఖాతా చార్జీలు, క్రెడిట్ కార్డు నియమాలు, చిన్న పొదుపు ఖాతాల నిబంధనలు ఉన్నాయి. వీటితో పాటు టీడీఎస్ రేట్లు, ఆధార్ కార్డు నియమాలు తదితర వాటిని సవరించారు. ఇవన్నీ అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.
సెక్షన్ 194 ఐఏ ప్రకారం రూ.50 లక్షలకు మించి స్థిరాస్తి విక్రయానికి సంబంధించిన చెల్లింపులపై తప్పనిసరి 1 శాతం టీడీఎస్ ఉండాలని చెబుతుంది. ప్రతి కొనుగోలుదారు, అమ్మకందారు ఆస్తి విలువ రూ.50 లక్షల కంటే తక్కువగా ఉంటే టీడీఎస్ ఫైల్ చేయాలా, వద్దా అనే దానిపై గతంలో సమస్య ఉండేది. ఇప్పుడు దీనిపై స్పష్టత వచ్చింది. ఒక్కో షేర్ రూ.50 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తి మొత్తం విలువ దానికి మించితే టీడీఎష్ ఫైల్ చేయాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సేవింగ్ ఖాతాలకు వర్తించే కొన్ని ఆన్ క్రెడిట్ సేవల ఖర్చులకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహణ, డిమాండ్ డ్రాప్ట్ లను జారీ చేయడం, చెక్కులపై చార్జీలు ఉంటాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాత బ్యాంకులు జారీ చేసిన చెక్కు బుక్ లు నడిచాయి. అక్టోబర్ ఒకటి నుంచి అవి చెల్లవు, ఆయా బ్యాంకుల ఖాతాదారులు పీఎన్ బీ నుంచి కొత్త చెక్ బుక్కులు తీసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..