Air Conditioners: మరింత ప్రియం కానున్న ఏసీల ధరలు.. ఎందుకంటే

Air Conditioners: ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఎలక్ట్రానిక్స్‌కు..

Air Conditioners: మరింత ప్రియం కానున్న ఏసీల ధరలు.. ఎందుకంటే

Updated on: Jul 01, 2022 | 7:46 AM

Air Conditioners: ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇక ఎయిర్‌ కండీషనర్ల (AC) ధరలు త్వరలో పెరగనున్నాయి. ఏసీల నాణ్యత ప్రమాణాలను నిర్దేశించేర ఏటింగ్స్‌పై కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీల ధరలు 7 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏసీలో కొనేవారికి అధిక భారం పడనుంది.

దేశంలో ఏసీల ఇంధన వినియోగ ప్రమాణాలకు సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీసియెన్సీ (BEE) ఏప్రిల్‌ 19 జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు వచ్చే నెల నుంచి ఈ కొత్తరేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈనెల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలను ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై AC తయారీదారులు వెల్లడించలేదు. మార్గదర్శకాల ప్రకారం.. AC తయారీదారులు తమ మోడల్‌ల డిజైన్‌లను కొంచెం మార్చవలసి ఉంటుంది. ఎయిర్ ప్లో, రాగి గొట్టాల ఉపరితల వైశాల్యాన్ని పెంచనున్నారు. ఎయిర్ కండీషనర్లు సమర్థవంతంగా పనిచేయాలంటే కంప్రెసర్‌ను కూడా అందించాలి. పాత మోడల్‌ల కన్నా తక్కువ శక్తిని వినియోగించుకోవాలి. ఈ మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత.. జూన్ 30, 2022లోపు తయారైన అన్ని ఎయిర్ కండీషనర్ల ఎనర్జీ రేటింగ్ గడువు ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి