AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని పనులు AI చేస్తే.. మనం ఏం చేయాలో చెప్పేసిన ఎలాన్‌ మస్క్‌! అదేంటో తెలిస్తే మీరు కూడా నిజమే అంటారు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే భయాలు పెరుగుతున్నాయి. TCS, అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే AIని ప్రవేశపెడుతున్నాయి. ఎలన్ మస్క్ AI అన్ని ఉద్యోగాలను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరిస్తూ, మానవాళికి పని నుండి విముక్తి లభిస్తుందని, సార్వత్రిక అధిక ఆదాయం (UHI) వస్తుందని అంచనా వేశారు.

అన్ని పనులు AI చేస్తే.. మనం ఏం చేయాలో చెప్పేసిన ఎలాన్‌ మస్క్‌! అదేంటో తెలిస్తే మీరు కూడా నిజమే అంటారు..
Elon Musk Ai Prediction
SN Pasha
|

Updated on: Oct 22, 2025 | 8:47 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన సమాజాన్ని మారుస్తోంది. గతంలో మానవ ఇన్‌పుట్‌పై ఆధారపడిన చాలా పనులను AI చేయగలదు. దీని వలన ఆఫీసుల్లో మనుషుల స్థానాన్ని AI త్వరలో భర్తీ చేస్తుందనే భయాలు తలెత్తాయి. భయపడినట్టే TCS, యాక్సెంచర్ వంటి ప్రధాన కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్‌ మరో షాకింగ్‌ విషయం చెప్పారు. ఏఐ అన్ని ఉద్యోగాలు భర్ చేస్తుందని హెచ్చరించారు. అమెజాన్ సంస్థ తన ఉద్యోగులను AI, రోబోలతో భర్తీ చేయాలనే ప్రణాళికలకు సంబంధించి ఇటీవలి నివేదికను పేర్కొన్న ఎక్స్‌లో పోస్ట్‌కు మస్క్ రీపోస్ట్‌ చేశారు. అమెరికన్ దిగ్గజం 2027 నాటికి 1,60,000 ఉద్యోగాలను రోబోలతో తగ్గించాలని యోచిస్తోంది. దీనిపై ఎలోన్ మస్క్ చాలా సూటిగా AI, రోబోలు అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాయి అని అన్నారు.

టెక్ పరిశ్రమ భవిష్యత్తు గురించి ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంటే టెస్లా CEO వ్యాఖ్య భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఉద్యోగం కోల్పోతామనే భయం కంటే ప్రతిరోజూ పని చేయవలసి రావడం నుండి మానవాళి విముక్తి పొందేందుకు ఇది ఒక అవకాశంగా ఆయన భావిస్తున్నారు. ఎలాగో ఉద్యోగాలు పోయి ఖాళీగా ఉంటాం. అప్పుడు దుకాణం నుంచి కూరగాయాలు కొనే బదులు వాటిని మనమే పండించుకోవచ్చు అని మస్క్‌ పేర్కొన్నారు. మాక్రోహార్డ్ అనే AI సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్మించడానికి మస్క్ స్వయంగా xAIకి నాయకత్వం వహిస్తున్నారు. టెస్లా ఆప్టిమస్ రోబోట్‌ను మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తోంది.

AI అన్ని ఉద్యోగాలను స్వాధీనం చేసుకున్న తర్వాత సార్వత్రిక అధిక ఆదాయం వస్తుందని ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు. మనమందరం మన జీవితాలను నిలబెట్టుకోవడానికి డబ్బు సంపాదించడానికి పని చేస్తాం. AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం వెనుక ప్రధాన కారణం ఇదే. కానీ ఎలోన్ మస్క్ మరోలా భావిస్తున్నారు. ఒక ప్రత్యేక వ్యాఖ్యలో AIతో పని చేయడం మానవులకు ఐచ్ఛికం అవుతుందని మస్క్ పేర్కొన్నాడు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి