Fact Check: నేటి కాలంలో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్ అవసరం లేని ముఖ్యమైన పని అంటూ ఏదీ లేదు. ఇది ఆర్థిక పని నుండి ఐడీ ఫ్రూప్‌గా ఉపయోగించబడుతుంది. బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి పాన్ కార్డు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ లు దాఖలు చేసే వరకు ప్రతి పనికి వినియోగిస్తున్నారు. ఇది కాకుండా రైలు, విమానంలో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డ్ అవసరం. ప్రభుత్వ సంస్థ UIDAI దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డును తయారు చేయడానికి పని చేస్తుంది.
ఆధార్ పెరుగుతున్న యుటిలిటీ కారణంగా UIDAI వ్యక్తులు ఆధార్‌లో పేరు, లింగం, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ మొదలైన సమాచారాన్ని నవీకరించడానికి అనుమతిస్తుంది. ఆధార్ అవసరం పెరగడంతో పాటు దానికి సంబంధించిన తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆధార్‌కు సంబంధించిన ఏదైనా అపోహను తొలగించడానికి యూఐడీఏఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో దానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఈ రోజుల్లో ఆధార్ నంబర్ ద్వారా ఎవరైనా ఎవరి ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#AadhaarMythBusters #AadhaarFacts#UIDAI केवल न्यूनतम जानकारी नामांकन/अपडेट के समय लेता हैं , इसमें आपका नाम, पता, लिंग,जन्म तिथि, उंगलियों के निशान, आइरिस स्कैन,और चेहरे की तस्वीर शामिल है।#UIDAI कभी भी निवासी की कोई वित्तीय जानकारी / डेटा नहीं रखती है।
आधार है तो विश्वास है । pic.twitter.com/2GyvM6Eo13— Aadhaar (@UIDAI) September 12, 2022
సోషల్ మీడియాలో ఆధార్ నంబర్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నారనే వాదనపై UIDAI ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని యూఐడీఏఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. UIDAI ఏ నివాసి ఆర్థిక సమాచారం లేదా డేటాను కలిగి ఉండదు. ఆధార్ నంబర్ ద్వారా ఎలాంటి ఆర్థిక సమాచారాన్ని పొందలేరు. ఇలాంటి ఫేక్ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి